Snow in Kashmir: భూతల స్వర్గం మన కాశ్మీరం

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు విపరీతంగా కురుస్తుంది. ఎటు చూసిన తెల్లటి తివాచీ పరిచినట్లు అడుగులోతు మంచుతో నిండిపోయింది

Snow in Kashmir: జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు విపరీతంగా కురుస్తుంది. ఎటు చూసిన తెల్లటి తివాచీ పరిచినట్లు అడుగులోతు మంచుతో నిండిపోయింది. ఇక శ్రీనగర్ రైల్వే స్టేషన్ పూర్తిగా మంచుతో కప్పబడిఉంది. స్టేషన్ పైనా, ప్లాట్ఫారంపైనా, రైలు పట్టాలపైనా మూడు అంగుళాల మేర మంచు కురిసింది. దీంతో శ్రీనగర్ పట్టణ పరిసర ప్రాంతాలు మంచు అందాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. పూర్తిగా మంచులో కూరుకుపోయిన శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

Also read: Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక

ఫొటోలతో పాటుగా ప్రముఖ ఇండో-పర్షియన్ సూఫీ గాయకుడు అమీర్ ఖుస్రూ రాసిన పద్యాన్ని రెండు లైన్లు ట్వీట్ కు జోడించారు. “భూమిపై స్వర్గం అనేది ఉంటే.. అది ఇదే, ఇక్కడే ఉంది” అంటూ ప్రముఖ గాయకుడి సాహిత్యాన్ని రైల్వేశాఖ మంత్రి తన ట్వీట్ కు జతచేశారు. తెల్లటి పత్తి పాన్పు పరిచినట్లుగా మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం అందాలు చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే..తుఫాను కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలోనూ విపరీతంగా మంచు కురిసింది. దీంతో షిమ్లా అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కాగా మరో మూడు రోజుల పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మంచు తుఫాను కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Also read: Toyota Hilux: టయోటా Hilux పికప్ ట్రక్ బుకింగ్ లు ప్రారంభం

ట్రెండింగ్ వార్తలు