Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక

రష్యాకు చెందిన ఈ బాలిక పేరు ఎవ్నికా సాద్వాకాస్. ప్రపంచంలోనే బలమైన బాలికగా ఇప్పటికే రికార్డుకెక్కిన ఈ బాలికకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం.

Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక

Boxer

Strong Girl Child: “చెయ్యి చూశావా.. ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడిస్తా” అంటూ ఒక తెలుగు సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఈ బాలికకు సరిగ్గా సరిపోతుందేమో. 12 ఏళ్ల ఈ బాలిక తన చేతులతో పిడిగుద్దులు కురిపించి చెట్టును కూల్చివేసిన ఆ దృశ్యాన్నిచూస్తే మీరు కూడా అదే అంటారు. రష్యాకు చెందిన ఈ బాలిక పేరు ఎవ్నికా సాద్వాకాస్. ప్రపంచంలోనే బలమైన బాలికగా ఇప్పటికే రికార్డుకెక్కిన ఈ బాలికకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. నాలుగేళ్ళ పసిప్రాయం నుంచే బాక్సింగ్ పై మక్కువ పెంచుకున్న ఎవ్నికా..ఆదిశగా సాధన చేపట్టింది.

Also read: Toyota Hilux: టయోటా Hilux పికప్ ట్రక్ బుకింగ్ లు ప్రారంభం

ఎవ్నికా తండ్రి రుస్త్రం సాద్వాకస్.. ప్రొఫెషనల్ బాక్సింగ్ కోచ్. చిన్నతనంలోనే ఎవ్నికా ప్రతిభను గుర్తించిన రుస్త్రం..ఆమెను ఆదిశగా ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఎవ్నికా కఠోర సాధన చేసింది. ఎదురుగా ఉన్న వస్తువు ఏదైనా సరే పంచ్ ల వర్షం కురిపించేది. రష్యాలోని వొరోనెజ్ ప్రాంతంలో నివాసం ఉండే ఎవ్నికా..తమ ఇంటి సమీపంలోని అడవిలో ఉండే చెట్లపై తరచూ సాధన చేసేది. అలా ఒక చెట్టుపై మెరుపువేగంతో పిడిగుద్దులు కురిపించిన ఎవ్నికా..క్షణాల వ్యవధిలో చెట్టును కూల్చి వేసింది. తన చేతులతో చెట్టు కాండాన్ని పిండి పిండి చేసి సెకండ్ల వ్యవధిలో బాలిక చెట్టును కూల్చి వేసిన దృశ్యం అందరిని ఆకట్టుకుంటుంది.

Also read: Microsoft Tab: భారత్ లో Surface Pro X ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

ఆ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఎవ్నికా తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్లు..గొడ్డలి లేకుండానే చెట్టును కూల్చిన చిన్నారి ప్రతిభకు ఫిదా అయిపోయారు. “మెరుపువేగంతో ఆ బాలిక విసిరిన పంచ్ లను చూస్తుంటేనే అర్ధం అవుతుంది అవి ఎంత బలంగా ఉన్నాయో. ఇక ఆ పంచ్ లకు ఎదురెళ్ళే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఎవ్నికాకు గొప్ప టాలెంట్ ఉంది, మంచి బాక్సర్ అవుతుందంటూ ఎవ్నికాను దీవిస్తున్నారు.

Also read: Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి