Maneka Gandhi : గాడిద పాలతో చేసిన సబ్బు మహిళలను అందంగా చేస్తుంది రూ. 500లకే ఈ సబ్బు లభిస్తోంది : మేనకాగాంధీ

గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా మారుస్తుందని ఈ సబ్బు కేవలం రూ.500లే అంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా గాడిదపాలతో స్నానం చేసేవారని తెలిపారు.

Maneka Gandhi Donkey Milk Soap

Maneka Gandhi : గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా మారుస్తుందని ఈ సబ్బు కేవలం రూ.500లే అంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బల్దిరాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనకాగాంధీ ప్రసంగిస్తూ..గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను అందంగా చేస్తుందని అన్నారు.  ఈ సబ్బు ఢిల్లీలో రూ.500లకే లభిస్తుంది అని తెలిపారు.  అంతేకాదు ఈజిప్టు రాణి క్లియోపాత్రా గాడిదపాలతో స్నానం చేసేవారని ఈ సందర్భంగా మేనకాగాంధీ తెలిపారు. మేనకాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ.. పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చిన సీఎం

ఇలా పాలతో సబ్బులను ఎందుకు తయారు చేయకూడదు? మేక పాలు, గాడిద పాలతో చేసిన సబ్బులను మనమెందుకు తయారు చేయకూడదని అన్నారు. గాడిద సంఖ్య తీవ్రంగా తగ్గిపోతోందని మీరు గాడిదలను చూసి ఎన్నాళ్లు అయ్యిందో చెప్పగలరా? అంటూ సమావేశంలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు మేనకా గాంధీ. ఒకప్పుడు రజకులు (చాకలివారు) గాడిదలను ఉపయోగించేవారు ఇప్పుడు వారు కూడా మానేసారు. లఢఖ్ లో గాడిదల సంఖ్య తగ్గిపోతోంది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. లఢాఖ్ లో గాడిదల సంఖ్య తగ్గిపోతోందని గుర్తించే సంఘం ఉంది. వారే గాడిదలకు పాలు పట్టి బతికిస్తున్నారని..వారే గాడిద పాలతో సబ్బులు తయారు చేయటం ప్రారంభించారని తెలిపారు. లడాఖ్ ప్రజలు గాడిద పాలతో చేసిన సోపులను తయారు చేస్తారని తెలిపారు.