జామియా విద్యార్థులకు సంఘీభావం : వర్సిటీలకు పాకిన సవరణ సెగలు

  • Publish Date - December 16, 2019 / 06:41 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా దేశంలోని వివిధ యూనివర్సిటీలకు పాకుతున్నాయి. ఢిల్లీలోని JNU, జామియా వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్ ముస్లిం వర్సిటీ, దక్షిణాది ప్రాంతంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళనలు చేపడుతున్నారు. 

జామియా విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. స్టూడెంట్స్‌ని రౌండప్ చేసి..లాఠీలతో బాదడాన్ని వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో…వింటేర్ వేకేషన్ సెలవులు డిసెంబర్ 25 నుంచి జనవరి 16వరకు ఉంటాయి. కానీ పరిస్థితులు చేయి దాటుతుండడంతో ముందుగానే జనవరి 05వ తేదీ వరకు హాలీడేస్ ప్రకటించారు. 

* ఆలీ ఘడ్ యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. క్యాంపస్‌లోకి వచ్చి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 
* లక్నో నాద్వా కాలేజీలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. కాలేజీ గేట్లను మూసివేశారు. 
* హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. గేటు ముందు విద్యార్థులు బైటాయించారు
* సుప్రీంకోర్టు ముందుకు జామియా యూనివర్సటీ ఘటన వచ్చింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 
* ఇప్పుడే జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. అల్లర్లు అదుపులోకి వస్తే..విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 
Read More : పౌరసత్వ సవ రణం : భయం..భయంగా ఉంది జామియా స్టూడెంట్స్