Sologamy Kshama Bindu : తనను తానే పెళ్లి చేసుకోవాలన్న అమ్మాయికి మరో కష్టం.. అయినా తగ్గేదేలే..

తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో ఆమె ఒక్కసారిగా న్యూస్ లోకి ఎక్కింది. తాజాగా ఆ అమ్మాయికి మరో కష్టం వచ్చి పడింది.

Sologamy Kshama Bindu

Sologamy Kshama Bindu : క్షమా బిందు.. ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. ఓ ప్రకటనతో ఈమె సెన్సేషనల్ అయిపోయింది. ఆమె తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

గుజరాత్ కు చెందిన ఈ బ్లాగర్ తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో ఆమె ఒక్కసారిగా న్యూస్ లోకి ఎక్కింది. భారత్ లో ఇలాంటి వివాహం (సోలోగమీ) ఇదే మొదటిది కావడంతో అందరి దృష్టి క్షమా బిందుపై పడింది. 24 ఏళ్ల క్షమా బిందు ప్రస్తుతం వడోదరాలో ఉంటోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ నెల 11న పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె ఇప్పటికే వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ చేయించింది. స్థానిక గోత్రి ఆలయంలో తన పెళ్లి జరగనుందని తెలిపింది. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్లే అని క్షమా బిందు అనుకుంటున్న సమయంలో ఆలయ వర్గాలు ఆమెకి షాక్ ఇచ్చాయి. ఆలయంలో ఇటువంటి పెళ్లిళ్లకు తాము అనుమతించలేమని తేల్చి చెప్పాయి.(Sologamy Kshama Bindu)

ఆలయంలో అవకాశం లేకపోతేనేమి.. తన ఇంట్లోనే పెళ్లితంతు కానిచ్చేస్తే పోలా అని బిందు డిసైడ్ అయింది. ఇంతలో క్షమా బిందుకు మరో కష్టం వచ్చిపడింది. ఇంటి వద్దనైనా పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మడికి పురోహితుడు కూడా హ్యాండిచ్చేశాడు. ఈ పెళ్లి తంతు తాను జరిపించలేనని ఆయన తప్పుకున్నాడు. పురోహితుడు కూడా వెనక్కి తగ్గాడని, తన పెళ్లికి వేదిక కూడా లేకుండా పోయిందని ఓ వీడియోలో వెల్లడించింది బిందు.

ఇక లాభం లేదు.. ఆన్ లైన్ లో చూసి పెళ్లి మంత్రాలు చదువుతూ తన పెళ్లి తానే జరిపించుకుంటానని వెల్లడించింది. అంతేకాదు, తన పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటానని చెబుతోంది.

కాగా, క్షమా బిందు చేసిన సోలోగమీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో ఆమెను సపోర్ట్ చేస్తే మరికొందరేమో తిట్టిపోస్తున్నారు.

Sologamy: గుడిలో ఆమె పెళ్లికి అంగీకరించం: గుజరాత్ బీజేపీ మహిళా నేత

”రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతాను. కానీ, నన్ను కలిసేందుకు చాలామంది వస్తున్నారు. మీడియా వాళ్ల తాకిడీ పెరిగింది. దీంతో నా పొరుగువారికి ఇది కొంత ఇబ్బందిగా మారింది. వారు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. సందర్శకుల గురించి వారు ఫిర్యాదు చేశారు. నా దగ్గర గోల చేశారు. ఈ నేపథ్యంలో, మీడియా వాళ్లు దూరంగా ఉండాలంటూ నా ఇంటికి ఓ బోర్డు తగిలించాల్సి వచ్చింది” అని క్షమా బిందు వాపోయింది.

కాగా, గుడిలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించగా, దీనిపై స్థానిక బీజేపీ మహిళా నాయకురాలు అభ్యంతరం తెలిపారు. ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నారు. దీంతో ఎవరి మనోభావాలు గాయపరచకూడదని, పెళ్లి వేదికను మార్చాలని నిర్ణయించుకున్నట్టు బిందు తెలిపింది. పూజారి సమక్షంలో ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు పూజారి హ్యాండ్ ఇచ్చాడని వాపోయింది. అయినా, పర్లేదు.. మంత్రాలను ప్లే చేస్తూ నా పెళ్లి నేనే చేసుకుంటాను అని చెప్పింది. కాగా, తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్లు జూన్ 2 క్షమా బిందు తొలిసారిగా చెప్పింది.