Sologamy: గుడిలో ఆమె పెళ్లికి అంగీకరించం: గుజరాత్ బీజేపీ మహిళా నేత
గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘సోలోగామి’గా పిలిచే ఈ పెళ్లి ఈ నెల 11న జరగనుంది. గోత్రిలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించుకుంది.

Sologomy
Sologamy: గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘సోలోగామి’గా పిలిచే ఈ పెళ్లి ఈ నెల 11న జరగనుంది. గోత్రిలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించుకుంది. అయితే గుడిలో ఈ పెళ్లి చేసుకునేందుకు తాము అంగీకరించబోమని ప్రకటించింది గుజరాత్, వడోదరకు చెందిన బీజేపీ మహిళా నేత సునీతా శుక్లా. సోలోగామి హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకమని, అందువల్ల గుడిలో పెళ్లి చేసుకునేందుకు అనుమతించబోమని అన్నారు. ఈ విషయంపై సునీత మీడియాతో మాట్లాడారు.
Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
‘‘క్షమా బిందు గుడిలో పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి అంగీకరించం. ఇలాంటి పెళ్లిళ్లు హిందూ సంప్రదాయానికి వ్యతిరేకం. తననుతానే పెళ్లి చేసుకునే విధానం (సోలోగామి) వల్ల హిందూ జనాభా తగ్గుతుంది. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే, వాళ్లకు చట్టం కూడా సహకరించదు. క్షమా బిందు మానసిక స్థితి సరిగ్గా లేదు’’ అని సునీతా శుక్లా వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో క్షమా బిందు గుడిలో పెళ్లి చేసుకుంటుందా? లేక మరేదైనా వేదికపై పెళ్లి చేసుకుంటుందా? అనేది తెలియాలి.