Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘మేజర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. యంగ్ హీరో అడివి శేష్....

Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Major Ott Release To Be At This Time

Major: ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘మేజర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. యంగ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు శశి కిరణ్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా విజయంవైపు దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ కూడా ఆసక్తిని కనబరుస్తుండటంతో, ఈ వీకెండ్‌లో ఆడియెన్స్ బెస్ట్ ఛాయిస్‌గా మేజర్ నిలవనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Major: మేజర్ టార్గెట్ ఎంతో తెలుసా?

అయితే ఇన్ని రోజులుగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూడగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మేజర్ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్ అయిన 60 రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అంటే.. జూన్ 3న థియేటర్లలో రిలీజ్ అయిన మేజర్, నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుందని తెలుస్తోంది.

Major : సినిమా టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు, అడివి శేష్..

ఇక అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏప్లస్ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.