Major: మేజర్ టార్గెట్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంటి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాను వీరజవాన్ మేజర్.....

Major: మేజర్ టార్గెట్ ఎంతో తెలుసా?

Major Pre Release Business Details

Major: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంటి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాను వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించింది మేజర్ చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ బాబు నిర్మాతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్నాడు. కాగా.. ఈ సినిమా ఇప్పటికే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Major : సినిమా టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు, అడివి శేష్..

తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో మేజర్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రియల్ లైఫ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని డిస్ట్రిబ్యూటర్లు కూడా అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే వారు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.

Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..

ప్రపంచవ్యాప్తంగా మేజర్ సినిమా ఏకంగా రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తుంగడా, సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.14 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా మేజర్ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.3.50 కోట్లు
సీడెడ్ – రూ.2 కోట్లు
ఆంధ్ర – రూ.4.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.10 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – రూ.1 కోట్లు
ఓవర్సీస్ – రూ.2 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – రూ.13 కోట్లు