నిషేధిస్తే ఎలా? : మద్యం తాగటానికి స్వేచ్ఛ ఉండాలి : మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 07:35 AM IST
నిషేధిస్తే ఎలా? : మద్యం తాగటానికి స్వేచ్ఛ ఉండాలి : మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated On : January 11, 2020 / 7:35 AM IST

మద్యం తాగటానికి ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలని..అది చాలా అవసరమనీ మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరాల్లోని ప్రజలకు మద్యం తాగేందుకు స్వేచ్ఛనివ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో మనిషికి స్వేచ్ఛ ఉందని..ప్రజలకు నచ్చింది తినడానికి..తాగడానికి హక్కు ఉందని..అందుకే మద్యంపై నిషేధం ఉండకూడదని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉప దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిన క్రమంలో మంత్రి గోపాల్ సింగ్ (శుక్రవారం,జనవరి10)  ఈ వ్యాఖ్యలు చేశారు.

మద్యం తాగాలనుకునే వారు స్వచ్ఛంధంగా తాగుతారనీ..వారిని మద్యం తాగమని ఎవ్వరూ బలవంత పెట్టరు అన్నారు. కొంతమందికి చికిత్స కోసం మద్యం తాగటం చాలా అవసరమని అన్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వారు ప్రతీరోజు ఓ పెగ్ తీసుకుంటారు. హాయిగా నిద్రపోతారు. ఓ పెగ్ తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారనీ అలా తాగే స్వేచ్ఛ వారికి లేకపోతే హాయిగా ఎలా నిద్రపోతారు? యాక్టివ్ గా ఎలా ఉంటారు? నిద్రలేకపోతే ఆరోగ్యం పాడుతుంది..అందుకే మద్యం తాగేస్వేచ్ఛ ఉండాలి అన్నారు.  ప్రజల తినే తిండిపైనా తాగే అలవాట్లపై మా ప్రభుత్వం నిషేధం విధించదు అంటూ వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాన్ని నియంత్రించి..ఆదాయ నష్టాన్ని భర్తీ చేసే ఉద్దేశ్యంతో కమల్ నాథ్ ప్రభుత్వం మద్యం షాపులు  తెరవడానికి నిర్ణయం తీసుకుందని మంత్రి గోవింద్ సింగ్ తెలిపారు. 

ఇటీవల..సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాలు..గ్రామీణ ప్రాంతాల్లో మద్యం కాంట్రాక్టర్లకు ఉప దుకాణాలను తెరవడానికి అనుమతించే నిబంధన చేసింది. నగదు సంక్షోభానికి గురైన రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
దీంట్లో భాగంగా..ప్రస్తుత మద్యం దుకాణ యజమానులు లైసెన్స్ ఫీజు చెల్లించిన అనంతరం పట్టణ ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఒక మద్యం షాపులు పెట్టుకోవచ్చు.