గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గుజరాత్ ప్రజలు రాహుల్ గాంధీ వ్యవహార శైలిని బయటపెట్టారని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(మార్చి-26, 2019) అహ్మదాబాద్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also : అంబానీ ఫ్యామిలీనా మజాకా : కోడలికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అత్త
అహ్మదాబాద్ ర్యాలీలో యోగి మాట్లాడుతూ…గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు 2017 నవంబర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయానికి వెళ్లారు.ఆలయంలో నమాజ్ చేస్తున్న విధంగా కూర్చున్నారు.దీంతో ఇది దేవాలయం అంటూ ఆలయ పూజారి రాహుల్ ని మందలించారని తెలిపారు.కొత్త తరం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ఆలయాలను సందర్శిస్తుంటారని యోగి విమర్శించారు.
శుక్రవారం(మార్చి-29,2019) అయోధ్యలో తూర్పు యూపీ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రియాంక గాంధీ చేపట్టనున్న పర్యటనపై కూడా యోగి విమర్శలు గుప్పించారు.ఎన్నికలు ఉన్నప్పుడే వారికి పుణ్యక్షేత్రాలు గుర్తుకు వస్తాయని,ఎన్నికలు లేకపోతే వారికి పుణ్యక్షేత్రాలు సందర్శించే సమయముండదని సెటైర్లు వేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతోనే కాంగ్రెస్ నేతలు ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా ఉత్సవంలో పాల్గొన్నారని విమర్శించారు.
గంగా అపరిశుభ్రంగా ఉందంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని,అయితే ప్రజలు గంగా నది నీటిని త్రాగటం చూసి..కాంగ్రెస్ నాయకులు కూడా గంగా నీళ్లు త్రాగటం మొదలుపెట్టారని పరోక్షంగా ప్రియాంక గాంధీ చేపట్టిన గంగా పర్యటనపై యోగి సెటైర్లు వేశారు.అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు.
Read Also : వైసీపీలో టెన్షన్: పాల్ రావాలి.. పాలన మారాలి