తల్లి తన కుమారుడికి కటింగ్ చేయించినందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కుంద్రతూరులో ఆదివారం చోటు చేసుకుంది.
యువత కేశాలంకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెంట్రుకలు పెంచి.. జుట్టును స్టైల్‌గా తీర్చిదిద్దుకుంటున్నారు. రోజుకో స్టైల్‌ను మెయింటెన్ చేస్తున్నారు. కేశాలంకరణకు క్రేజీ బాగానే ఉంది. అయితే ఓ తల్లి తన కుమారుడికి కటింగ్ చేయించినందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కుంద్రతూరులో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహన అనే మహిళ రోజు కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే పొంగల్ సెలవుల్లో కుమారుడు ఇంటికి వచ్చాడు. తన కుమారుడు పెంచిన జుట్టును చూసి తల్లి కోపం అయింది. జుట్టు పెద్దగా ఉండొద్దు, చిన్నగా ఉంచుకుని బుద్ధిమంతుడిలా ఉండాలని తల్లి కుమారుడిని మందలించింది.
ఆదివారం ఉదయం హెయిర్ సెలూన్‌కు తీసుకెళ్లి.. కుమారుడికి కటింగ్ చేయించింది. ఆ తర్వాత ఆమె కూలీ పనులకు వెళ్లింది. కుమారుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి చూడగా కుమారుడు చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.