డెత్ సర్టిఫికెట్ కోసం:అధికారుల దగ్గరకు కొడుకు శవాన్ని మోసుకెళ్లాడు

  • Publish Date - October 3, 2019 / 06:18 AM IST

ప్రభుత్వం డాక్టర్ల తీరు ఓ తండ్రి హృదయాన్ని కోతకు గురిచేసింది. ఏంటీ నాకీ ఖర్మ..చచ్చిపోయిన కొడుకు గురించి ఏడవాలా? పిల్లాడు చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఏడవాలా? అని హృదయవిదారకంగా రోదిస్తున్న ఓ తండ్రి ఆవేదన చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోతున్నారు. చనిపోయిన పిల్లాడి శవాన్ని భుజం మీద మోసుకుంటూ అధికారుల చుట్టూ డెత్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్న ఓ తండ్రి ఆవేదన ఇది. చనిపోయిన పిల్లాడిని భుజన వేసుకుని తిరుగుతున్నాడు ఓ తండ్రి. ఓపక్క వేదన..రూల్స్ ఒప్పుకోవు అంటూ డాక్టర్లు పెట్టిన ఆంక్షలు వెరసి ఓ తండ్రి అంతులేని..చెప్పుకున్నా తీరని వేదన గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో బుధవారం (అక్టోబర్ 2)న జరిగింది. 

వివరాల్లోకి వెళితే..అది లఖీమ్‌పూర్- ఖీరీ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్. నీమ్ గావ్ పరిధిలో ఉన్ రమువాపుర్ గ్రామానికి చెందిన దినేష్ చంద్ కు నాలుగేళ్ల ఓ కొడుకు ఉన్నాడు. వాడి పేరు దుష్యంత్. వాడికి జ్వరం రావటంతో లఖీమ్‌పూర్- ఖీరీ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ దుష్యంత్ చనిపోయాడు. దీంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. కొడుకు శవాన్ని పట్టికెళ్లాలంటే గవర్నమెంట్ అధికారుల దగ్గర డెత్ సర్టిఫికెట్ తేవాలని..లేకండా శవాన్ని ఇచ్చేది లేదన్నారు  డాక్టర్లు.

దీంతో  కుమారుని డెత్ సర్టిఫికెట్ కోసం అధికారుల్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో దినేష్ చంద్ నానా అవస్థలు పడ్డాడు. కానీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే పిల్లాడు చనిపోయినట్లుగా డాక్టర్ల దగ్గర నుంచి లెటర్ తేవాలని అధికారులు అన్నారు. అలా అధికారులు దగ్గర నుంచి డాక్టర్ల దగ్గరు దినేష్ చంద్ పలు మార్లు తిరిగాడు. దీంతో తిరిగి తిరిగి విసిగిపోయిన  దినేష్ చంద్ కొడుకు శవాన్ని తీసుకుని అధికారుల చుట్టూ తిరిగాడు. అతని పరిస్థితి  చూసిన అక్కడివారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఎట్టకేలకు అధికారులు  దుష్యంత్ డెత్ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. తరువాత దినేష్ కుమారుని మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లగలిగాడు. ఇది ప్రభుత్వ అధికారుల వైఖరికి అద్దంపడుతున్న మరో ఘటనగా కనిపిస్తోంది.