Prashant Mohapatra : కరోనాతో ఆ బీజేపీ ఎంపీ కుమారుడు కన్నుమూత

ఒడిషాకు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్​ మోహపాత్ర(78)ఇటీవల కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.

Prashant Mohapatra

Prashant Mohapatra ఒడిషాకు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్​ మోహపాత్ర(78)ఇటీవల కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. అయితే రఘునాథ్ మరణించిన పది రోజులకే ఆయన కుమారుడు ప్రశాంత్ మోహపాత్ర బుధవారం కరోనాతో మరణించారు.

కాగా, రఘునాథ్​ మోహపాత్రతో పాటు ఆయన కుమారులిద్దరు కరోనా బారినపడటంతో ఏప్రిల్ 22న ఎయిమ్స్​లో చేరారు. ఏప్రిల్ 25న రఘునాథ్​ను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించి మే- 9న రఘునాథ్​ తుదిశ్వాస విడిచారు. బుధవారం(మే-19,2021) రఘునాథ్ కుమారుడు..ఒడిశా క్రికెట్ టీమ్ మాజీ సారథి అయిన ప్రశాంత్ మోహపాత్ర కన్నుమూశారు. నలుగురు సభ్యుల వైద్య బృందం ప్రశాంత్ కు చికిత్స అందించిందని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సచ్చిదానంద మోహంతి తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయినట్లు చెప్పారు. మరోవైపు, ప్రశాంత్ సోదరుడు జశోబంత్ ఆరోగ్య పరిస్థితి సైతం మెరుగుపడలేదని వెల్లడించారు.