Mumbai Police
Kind Parents: రోడ్డు ప్రమాదంలో అయిన వారిని కోల్పోవడం జీవితంలో దిగమింగలేని బాధను మిగుల్చుతుంది. ప్రమాదానికి కారణమైన ఎదుటి వారిపై కోపం పెరిగి, వారిపై పోలీసు కేసులు పెట్టి కోర్టు వరకు వెళ్లి చట్టపరమైన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంటారు కొందరు. అయితే ముంబైకి చెందిన ఒక దంపతులు మాత్రం..తమ కన్న కొడుకు మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ పై ఎటువంటి కోపం పెంచుకోగా పోగా..తిరిగి ఆ డ్రైవర్ ను జైలు శిక్ష నుంచి తప్పించేందుకు స్వయంగా పోలీసులతో చర్చలు జరుపుతన్నారు. వివరాల్లోకి వెళితే..ముంబైలోని నేపియన్ సీ రోడ్డులో వస్త్ర వ్యాపారం చేస్తున్న మనీష్ జరీవాలా దంపతులకు అమర్ జరీవాలా(43) అనే కుమారుడు ఉన్నాడు.
Other Stories: India-china border : ‘నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను’ అంటూ భారత్-చైనా బోర్డర్లో మహిళ హల్ చల్
మే 30న అమర్ జరీవాలా తన డ్రైవర్ ను తీసుకుని బాంద్రా – వర్లి సీలింక్ బ్రిడ్జి పై తన కారులో వెళుతుండగా..ఒక పక్షి అమర్ కారుపై పడింది, దీంతో అమర్, అతని డ్రైవర్ పక్షిని చూసేందుకు కారు దిగగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాక్సీ..వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమర్ జరీవాలా అతని డ్రైవర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా..అప్పటికే అమర్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ కూడా జూన్ 3న మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాద ఘటనలో ఇద్దరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ పై వర్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ ను జైలుకు తరలించారు పోలీసులు.
Other Stories: Covid cases Rising: ఐదు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా: కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అయితే, తమ కుమారుడు మృతి ఘటనలో ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ తప్పు లేదని, విధి ఎలా ఉంటే అలా జరిగిందని అమర్ జరీవాలా తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘ప్రాణులన్నీ సమానమే, జీవ దయ’ అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తున్న జరీవాలా కుటుంబం..తమ కుమారుడి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ ను దయగల మనస్సుతో క్షమిస్తున్నట్టు తెలిపారు. అంతే కాదు..ట్యాక్సీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై మనీష్ జరీవాలా అడ్డు చెప్పారు. ట్యాక్సీ డ్రైవర్ కు ఒక కుటుంబం ఉంటుందని, కావాలని అతను ఈ ప్రమాదం చేయలేదు గనుక..మానవతా దృక్పధంతో ట్యాక్సీ డ్రైవర్ ను విడిచిపెట్టాలని మనీష్ జరీవాలా కుటుంబం పోలీసులను కోరింది.
Other Stories: Uttar Pradesh Violence: యూపీలో హింస్మాతక ఘటన కేసు.. 36 మంది అరెస్టు
అయితే వీరి విజ్ఞప్తిని పరిశీలించని వర్లి పోలీసులు మాత్రం, తాము ఈపాటికే ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని..అతనికి కోర్టు జైలు శిక్ష కూడా విధించిందని పేర్కొన్నారు. చట్టపరంగా తమ పని తాము చేసుకుపోతున్నామన్న వర్లి పోలీసు అధికారి..అనిల్ కోలి..అమర్ జరీవాలా తల్లిదండ్రులు మానవత్వంతో స్పందించిన తీరును ప్రశంసించారు. అయితే క్షమాభిక్షపై వారు కోర్టుకు వెళ్లినా ట్యాక్సీ డ్రైవర్ కు శిక్ష తప్పదని పేర్కొన్నారు.