Covid cases Rising: ఐదు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా: కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ ప్రారంభమైన సంకేతాలు వెలువడుతున్నాయని, ఆయా రాష్ట్రాల అధికారులు తక్షణ కట్టడి చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం లేఖలు రాశారు.

Covid cases Rising: ఐదు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా: కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

COVID-19

Covid cases Rising: దేశంలో కరోనా నాలుగో దశ వ్యాప్తి పొంచి ఉంది. జులై నాటికీ భారత్ లో నాలుగో దశ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వైద్యారోగ్య విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముంబై మహానగరం సహా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం పై ఆందోళన వ్యక్తం అవుతుంది. దాదాపు 84 రోజుల తరువాత గురువారం నాడు దేశంలో 4000 పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3962 కొత్త కోవిద్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్యా 4,31,72,547కి చేరుకోగా..ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,416గా నమోదు అయింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో మహమ్మారి భారిన పడి 26 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,24,677కి చేరుకుంది.

Other Stories: Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

ఇక గడిచిన 24 గంటల్లో 2697 మంది మహమ్మారి భారి నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,26,25,454కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉండగా..రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. కాగా, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరించి ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ ప్రారంభమైన సంకేతాలు వెలువడుతున్నాయని, ఆయా రాష్ట్రాల అధికారులు తక్షణ కట్టడి చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం లేఖలు రాశారు. ఆ ఐదు రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో కరోనా వ్యాప్తి ఉన్నట్లు లేఖలో పేర్కొన్న ఆయన..ప్రమాద అంచనా ఆధారిత విధానం ద్వారా కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Other Stories: Beggars Killed: బిచ్చగాళ్లపై వేడి నీళ్లు పోసిన హోటల్ యజమాని: తీవ్ర గాయాలతో ముగ్గురు మృతి

అలాగే, మే 27, 2022తో ముగిసిన వారంతో 0.52 శాతంగా ఉన్న వీక్లీ పాజిటివిటీ రేటు జూన్ 3 నాటికి 0.73 శాతానికి పెరిగింది. కేసుల సంఖ్య పెరిగే విధానంపై సమగ్ర అధ్యయనం జరిపి రాష్ట్రాల ఆరోగ్యశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఒక్కరోజులోనే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవడంపై బీఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటు కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ కరోనా విస్తరిస్తోందన్న సంకేతాల మేరకు.. వైద్యారోగ్యశాఖలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 3 నుంచి ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.