Beggars Killed: బిచ్చగాళ్లపై వేడి నీళ్లు పోసిన హోటల్ యజమాని: తీవ్ర గాయాలతో ముగ్గురు మృతి

తన హోటల్ ముందు కూర్చుని ముగ్గురు బిచ్చగాళ్ళు నిత్యం బిక్షం అడుకుంటున్నారనే అసహనంతో..హోటల్ యజమాని ఆ ముగ్గురు బిచ్చగాళ్లపై వేడి నీరు పోయగా..ఆ ముగ్గురు బిచ్చగాళ్ళు మృతి చెందారు

Beggars Killed: బిచ్చగాళ్లపై వేడి నీళ్లు పోసిన హోటల్ యజమాని: తీవ్ర గాయాలతో ముగ్గురు మృతి

Crime1

Beggars Killed: మహారాష్ట్రలోని పూణే సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన హోటల్ ముందు కూర్చుని ముగ్గురు బిచ్చగాళ్ళు నిత్యం బిక్షం అడుకుంటున్నారనే అసహనంతో..హోటల్ యజమాని ఆ ముగ్గురు బిచ్చగాళ్లపై వేడి నీరు పోయగా..ఆ ముగ్గురు బిచ్చగాళ్ళు మృతి చెందారు. ఈఘటన పూణే శివారు ప్రాంతం సాస్వద్ లో మే 23న చోటుచేసుకోగా..పోలీస్ కేసు నేపథ్యంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..సాస్వద్ లో నీలేష్ జయవంత్ జగ్తాప్ అనే వ్యక్తి స్థానిక అహిల్యా దేవి మార్కెట్ వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ముగ్గురు బిచ్చగాళ్ళు నిత్యం తన హోటల్ ముందు కూర్చుంటున్నారన్న అక్కసుతో..పలుమార్లు వారిని మందలించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆ ముగ్గురు అక్కడే ఉంటున్నారన్న కోపంతో వారిని వదిలించుకునేందుకు..మే 23న వారిని కర్రలతో చావబాదాడు నీలేష్ జయవంత్.

Other Stories: Jubilee Hills GangRape Issue : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. హోంమంత్రి మనవడికి క్లీన్ చిట్

దెబ్బలు తాళలేక.. అప్పటికే ఇద్దరు బిచ్చగాళ్ళు స్పృహకోల్పోగా..అది కూడా చాలదన్నట్టు వారిపైనా మరిగే వేడి నీళ్లు పోశాడు హోటల్ యజమాని నీలేష్ జయవంత్. దీంతో ఆ ముగ్గురు బిచ్చగాళ్ళు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన కూత వేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండగా, మృతదేహాలు 36 గంటల పాటు అలా రోడ్డుపైనే ఉన్నా పోలీసులు కూడా పట్టించుకోలేదు. దీంతో స్థానికులు కొందరు స్పందించి..హోటల్ యజమాని దుశ్చర్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తీరిగ్గా స్పందించిన పోలీసులు మే 30న హోటల్ యజమాని నీలేష్ జయవంత్ జగ్తాప్ పై కేసు నమోదు చేశారు. నీలేష్ జయవంత్ జగ్తాప్ స్థానిక ఎమ్మెల్యే బంధువు కావడంతోనే అతనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.