రాజ్యాంగాన్ని కాపాడతాం…రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ నిరసన

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్,రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్, ఏకే ఆంటోని,గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

పార్టీ నిరసనకు సంకేతంగా సోనియాగాంధీ, మన్మోహన్, రాహుల్… భారత రాజ్యాంగ పీఠికను చదవిన అనంతరం సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.  దీనికి కొద్ది గంటల ముందు రాహుల్ గాంధీ ఓ ట్వీట్‌లో వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా పార్టీ చేపడుతున్న సత్యాగ్రహంలో విద్యార్థులు, యువజనులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.