Delhi : విపక్షాలు ఒక్కటయ్యేనా ? సోనియా వర్చువల్ మీటింగ్

సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

Soniya

Sonia Gandhi : కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విపక్షాల నేతలతో 2021, ఆగస్టు 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు పలువురు సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉంది.

Read More : తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్ళీ కన్‌ఫ్యూజన్

ఇప్పటికే సోనియా గాంధీ కార్యాలయం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సహా పలువురికి ఆహ్వానాలు పంపగా.. వారంతా అంగీకరించినట్టు సమాచారం. ఈ భేటీలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీను ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.

Read More : Zaki: అమెరికా విమానం నుంచి జారిపడి చనిపోయిన వారిలో అప్ఘాన్ యువ ఫుట్ బాల్ ప్లేయర్

ముఖ్యంగా పెగాసస్, రైతుల ఆందోళనలపై విపక్ష నేతల అభిప్రాయాలను సోనియా చర్చించే ఛాన్స్‌ కనిపిస్తోంది. కేంద్రంపై పోరుకు ఉమ్మడి వ్యూహమే లక్ష్యంగా ఈ మీటింగ్‌ జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.