Zaki: అమెరికా విమానం నుంచి జారిపడి చనిపోయిన వారిలో అప్ఘాన్ యువ ఫుట్ బాల్ ప్లేయర్

అఫ్ఘానిస్తాన్ లో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ప్రజల బాధలు, అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబన్ల బారి నుంచి తప్పించుకోవడానికి

Zaki: అమెరికా విమానం నుంచి జారిపడి చనిపోయిన వారిలో అప్ఘాన్ యువ ఫుట్ బాల్ ప్లేయర్

Zaki Anwari

Updated On : August 19, 2021 / 10:54 PM IST

Zaki Anwari : అఫ్ఘానిస్తాన్ లో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ప్రజల బాధలు, అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబన్ల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పడుతున్న పాట్లు ఆవేదన కలిగిస్తున్నాయి.

కాగా, కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశిస్తున్నారన్న వార్తలతో అప్ఘాన్ ప్రజలు అమెరికా సైనిక విమానం ఎక్కి దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడం విషాదాంతం కావడం తెలిసిందే. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంటున్న అమెరికా సైనిక రవాణా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని పట్టుకుని వేళ్లాడిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో అఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు జకీ అన్వారీ ఒకరు.

గాల్లోంచి వ్యక్తులు జారిపడుతున్న వీడియో ఫుటేజి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో అప్ఘాన్ల పరిస్థితి పట్ల అందరిలోనూ తీవ్ర విచారాన్ని నింపింది. 19 ఏళ్ల జకీ అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ప్రతిభావంతుడైన ఫుట్ బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వారీ జాతీయ యూత్ జట్టులో సభ్యుడు.

తాలిబన్ల చెరలో తన ఫుట్ బాల్ కలను పండించుకోలేనని భావించిన ఆ యువకుడు, అమెరికా వెళ్లి ఆటలో రాణించాలని భావించాడు. కానీ, ప్రమాదకరరీతిలో సీ-17 వంటి భారీ విమానం ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలనుకున్నాడు. అయితే ఆ విమానం గాల్లోకి లేవగానే ల్యాండింగ్ గేర్ పైకి ఎక్కిన వాళ్లు కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జారిపడి చనిపోయారు. అన్వారీ మృతిని ఆఫ్ఘన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం నిర్ధారించింది.

కాగా, ఫేస్ బుక్ లో అన్వారీ చివరి పోస్టులో… “నీ జీవిత చిత్రాన్ని గీయాల్సింది నువ్వే… నీ జీవితాన్ని గీసేందుకు కుంచెను మరొకరికి అప్పగించొద్దు” అని ఉంది.