Punjab Election 2022 : సోనూ సూద్ కదలికలిపై నిఘా, కారు సీజ్

పంజాబ్ లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున మోగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సరళిని...

Sonu Sood In Moga : ప్రముఖ నటుడు సోనూ సూద్ కారును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఆయన కదలికలను ఎన్నికల సంఘం కట్టడి చేయడం గమనార్హం. పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాళీ దల్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. ఓ ప్రాంతంలో పోలింగ్ బూత్ కు వెళ్లిన సోనూ కారును సీజ్ చేశారు. దానికంటే ముందు… మోగాలోని ఇతర పార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు యత్నిస్తున్నారని, వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.

Read More : Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్

2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం పంజాబ్ లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున మోగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయన మోగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ శిరోమణి అకాలీదళ్ నేతలు ఆరోపిస్తూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను సోనూ సూద్ ఖండించారు. ఓ పార్టీకి ఓటేయాలని ఓటర్లను తాను కోరలేదని, పోలింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను మాత్రమే తాను సందర్శిస్తున్నట్లు చెప్పినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనపై మోగా ఎస్ఎస్పీని జిల్లా మెజిస్ట్రేట్ నివేదిక కోరినట్లు సమాచారం. ఎన్నికల కంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఐకాన్ గా నియమించిన విషయం తెలిసిందే.

Read More : Punjab Polls: నేడే పంజాబ్ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకే ప్రారంభం

పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతి ఉంది. మొత్తం 13 వందల నాలుగు మంది బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రెండు కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పంజాబ్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ప్రశాశ్‌ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్ భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. మరోవైపు చరణ్‌జీత్ సింగ్ చన్నీ, సిద్ధూ, ఒక ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌ బరిలో ఉన్నారు. పంజాబ్‌లో అధికారం కోసం అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపించాయి.

ట్రెండింగ్ వార్తలు