దక్షిణ కొరియా మాదిరిగా ఢిల్లీలో కరోనా పరీక్షలు : కేజ్రీవాల్

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.

  • Publish Date - April 6, 2020 / 08:02 PM IST

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం పరీక్షలను గణనీయంగా పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దక్షిణ కొరియా ఉదాహరణను ఉటంకిస్తూ మాట్లాడారు. దేశ రాజధానిలో కరోనా ఇప్పటివరకు ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం వరకు నగరంలో 523 COVID-19 కేసులు నమోదయ్యాయన తెలిపారు. 24 గంటల్లో 20 కొత్త కేసులు బయటపడ్డాయని చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రణకు పరిపాలనా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను కేజ్రీవాల్ తన రోజువారీ సమావేశంలో చెప్పారు. మొత్తం 330 కేసుల్లో మర్కజ్ తబ్లిగీ జమాత్ లింక్ ఉందని తెలిపారు.

24 గంటలలో 20 కేసులు వచ్చాయని, వాటిలో 10 కేసులు మర్కజ్ తో లింక్ కలిగి ఉన్నాయని తెలిపారు. మొత్తం రోగుల్లో 61 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని, ఏడుగురు మరణించారని చెప్పారు. 25 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో, ఎనిమిది మంది వెంటిలేషన్లో ఉన్నారని, మిగిలినవి స్థిరంగా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీలో కరోనావైరస్ అంటువ్యాధుల వ్యాప్తిని పరిమితం చేసేందుకు పరీక్షల కోసం దక్షిణ కొరియా పరీక్షా వ్యూహాన్ని ప్రస్తావించారు. శుక్రవారం నాటికి సుమారు లక్ష కొత్త టెస్టింగ్ కిట్లు వస్తాయని ఆయన చెప్పారు.

ఢిల్లీలో కేసుల సంఖ్య పెరగడాన్ని గమనించినట్లైతే మర్కజ్ ప్రార్థనకు వచ్చిన చాలా మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. తాము పరీక్షల సంఖ్యను పెంచామని, కావాలనుకునే వారు పరీక్షలు చేయించుకోవచ్చని కోరారు. ఇది రోగులను గుర్తించి వారికి చికిత్స చేయడంలో తమకు సహాయపడుతుందన్నారు. వారి పరిచయాలను గుర్తించవచ్చని, వేరుచేయవచ్చని చెప్పారు. ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తే కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అంత విజయవంతం అవుతామని చెప్పారు. కరోనా నియంత్రణలో అత్యంత విజయవంతమైనదిగా భావించే దక్షిణ కొరియా కూడా ఈ పద్ధతిని అనుసరించిందన్నారు. కాబట్టి తాము ఢిల్లీలో మరిన్ని పరీక్షలు కూడా చేస్తామని కేజ్రీవాల్ అన్నారు.

మార్చి 25 వరకు నగరంలో రోజుకు 100-125 పరీక్షలు జరిగాయని, ఇది ఏప్రిల్ 1 నాటికి 500కి పెరిగిందన్నారు. ప్రస్తుతం రోజువారీ పరీక్షల సంఖ్య దాదాపు 1,000 కి చేరుకుందని సిఎం కేజ్రీవాల్ తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహకారం పొందుతున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము 10 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని అవసరమైతే పెంచుతామని తెలిపారు. ఇందుకోసం సుమారు 421 పాఠశాలలను గుర్తించారని పేర్కొన్నారు.(దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం పురుషులే : లవ్ అగర్వాల్ )

నగరంలో 72 లక్షల మంది చెల్లుబాటు రేషన్ కార్డులున్నవారు ఉన్నారని తెలిపారు. ఒక్కొక్కరు 7.5 కిలోల రేషన్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ కోసం నెల మొదటి వారంలోనే పంపిణీ  ప్రారంభమైందన్నారు. విడిగా, ఆకలి ఉపశమన కేంద్రాలలో సుమారు 6.9 లక్షల మంది భోజనం చేస్తున్నారని తెలిపారు. ఆదివారం 6.94 లక్షల మంది భోజనం చేశారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.