Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

కాస్త ఆలస్యంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ముందుగా అంచనా వేసిన ప్రకారం మే 31 న కేరళ రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉంది. మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి.

Monsoon Hits Kerala : కాస్త ఆలస్యంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ముందుగా అంచనా వేసిన ప్రకారం మే 31 న కేరళ రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉంది. మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి.

నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో 90 శాతం వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 2021, జూన్ 03వ తేదీ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. కర్నాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఆలస్యమయ్యాయని చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత.. 4 నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మొదట కేరళను తాకి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి.

ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు