Sabarimala : అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే చిన్నారులకు శబరిమలలో ప్రత్యేక గేట్

ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది.

Sabarimala Ayyappaswamy

Sabarimala Ayyappaswamy : శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే చిన్నారులకు ప్రత్యేక గేట్ ఏర్పాటు చేశారు. శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీబీడీ) ప్రత్యేక గేట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు.

దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. ఈ చర్య చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కేరళ వెలుపలి నుంచి వచ్చిన భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టీబీడీ వెల్లడించింది. మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీబీడీ పేర్కొంది.