Cheetahs From Namibia: చీతాల్ని తెచ్చిన విమానం ఇండియాది కాదా? అసలు నిజం ఇదే!

ఇటీవల నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమానం ఇండియాకు చెందిన బోయింగ్ విమానమే అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఇది భారత్‌కు చెందిన విమానం కాదు.

Cheetahs From Namibia: నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 8 చీతాల్ని భారత ప్రభుత్వం ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీతాల్ని తీసుకొచ్చిన విమానానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

ఈ విమానం ముందు భాగంలో పులి ముఖాన్ని పోలిన పెయింటింగ్ వేశారు. చీతాల్ని తీసుకొచ్చిన విమానం కాబట్టి, అది చీతాలకు సంబంధించిన చిత్రమే అని, వాటి కోసమే విమానానికి ప్రత్యేకంగా పెయింటింగ్ చేశారని చాలా మంది అనుకున్నారు. కానీ, అది చీతా పెయింటింగ్ కాదు. అదో పులి చిత్రం. పులి ముఖాన్ని పెయింటింగ్‌గా వేశారు. విమానం ముందు భాగంలో దాని ముక్కు, మీసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విమానం ఇండియాది కాదు.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

మాల్దోవ్స్‌కు చెందిన టెర్రా అవివా అనే సంస్థ విమానమిది. ఈ సంస్థ అంతర్జాతీయంగా ప్రయాణ, కార్గో విమాన సర్వీసులు నిర్వహిస్తుంది. కాగా, చీతాల్ని తెచ్చిన ఈ విమానం ఇండియాకు చెందిన బోయింగ్ విమానమే అని ప్రచారం జరిగింది.