Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

వీధి కుక్క తన ఇంటి దగ్గర ఉండటం ఇష్టం లేని ఒక డాక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. ఆ కుక్కను తన కారుకు కట్టేసి, కారు నడుపుకొంటూ వెళ్లిపోయాడు. దీన్ని రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ ఘటనలో కుక్క గాయాలపాలైంది.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

Updated On : September 19, 2022 / 9:18 AM IST

Bone-chilling video: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక డాక్టర్ అమానుషానికి పాల్పడ్డాడు. ప్రాణాలు కాపాడి, మానవత్వం చూపించాల్సిన స్థానంలో ఉండి.. వీధి కుక్కతో అమానుషంగా ప్రవర్తించాడు. స్థానికంగా డాక్టర్‌గా పని చేస్తున్న రజనీష్ గాల్వా అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఒక వీధి కుక్క ఉంది.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

ఆ కుక్క తన ఇంటి దగ్గర ఉండటం ఇష్టం లేని ఆ డాక్టర్, కుక్క మెడకు తాడు కట్టాడు. తర్వాత ఆ తాడును కారుకు కట్టుకుని వేగంగా నడుపుకొంటూ వెళ్లాడు. పాపం ఆ కుక్క కారు వేగంతో వెనకాల పరుగెత్తలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. రోడ్డుపై ఈడ్చుకుంటూ, గాయాలపాలైంది. కుక్కును కారుకు కట్టేసి తీసుకెళ్తుండగా, రోడ్డుపై బైకు మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు. ఆ కారును ఆపి, కుక్కను విడిపించాడు.

Pawan Kalyan : వైసీపీకి వచ్చేది 45-67 సీట్లే.. ఈ సృష్టిలో ప్రతిదానికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది-జగన్ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

తర్వాత డాగ్ హోమ్ ఫౌండేషన్ వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్లు గాయపడిన కుక్కను చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలించారు. కుక్కను హింసించిన డాక్టర్‌పై యానిమల్ క్రుయెల్టీ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్‪లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.