Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

చండీఘడ్ యూనవర్సిటీ వివాదం కొనసాగుతోంది. క్యాంపస్‌లో అమ్మాయిలు ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. కాగా, ఒక్క వీడియోనే లీక్ అయిందని యూనివర్సిటీ అధికారులు చెబుతుండటాన్ని విద్యార్థినులు తప్పుబడుతున్నారు. కేసును తొక్కిపెట్టేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

Chandigarh University: చండీఘడ్ యూనివర్సిటీ వీడియో వివాదం కొనసాగుతోంది. ఘటన విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీలో రాత్రి కూడా నిరసనలు కొనసాగాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేయగా, మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Pawan Kalyan : వైసీపీకి వచ్చేది 45-67 సీట్లే.. ఈ సృష్టిలో ప్రతిదానికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది-జగన్ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

వీడియోలు స్నేహితుడికి పంపిన యువతిని అరెస్టు చేసిన పోలీసులు, ఆదివారం ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇద్దరూ సిమ్లాలోని రోహ్రు ప్రాంతానికి చెందిన వాళ్లే. ఈ ఇద్దరితో సంబంధం ఉందని భావిస్తున్న మరో 31 ఏళ్ల వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో సోమ, మంగళవారాలు సెలవు ప్రకటిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణంతో రెండు రోజులు ‘నాన్-టీచింగ్ డేస్’గా ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీలో అమ్మాయిలు చేస్తున్న ఆందోళనకు అబ్బాయిలు, యువత కూడా మద్దతు తెలుపుతోంది. విద్యార్థులంతా నలుపు రంగు దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లోని విద్యార్థినిలకు చెందిన 60 వీడియోలు లీక్ అయినట్లుగా ప్రచారం జరుగుతుండగా, యూనివర్సిటీ అధికారులు దీన్ని తోసిపుచ్చారు.

Allu Arjun : పుష్ప 2 మొదలైంది.. తగ్గేదేలే.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తారు..

60 వీడియోలు లీక్ కాలేదని, ఒక్క అమ్మాయికి చెందిన వీడియో మాత్రమే లీక్ అయిందని అధికారులు చెప్పారు. అలాగే ఏ అమ్మాయీ ఆత్మహత్య చేసుకోలేదన్నారు. కానీ, దీనిపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాల్ని తొక్కిపెట్టేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. కాగా, పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు. ఆ యువతి తన పర్సనల్ వీడియో మాత్రమే షేర్ చేసిందని, ఇతరుల వీడియోలు షేర్ చేయలేదని చెప్పారు. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. మరోవైపు పంజాబ్ డీజీపీ గురు‌ప్రీత్ డియో మాట్లాడుతూ అవసరమైతే సీనియర్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ బృందాన్నిఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్‌లో 4,000 మంది విద్యార్థులు ఉంటే ఒక్క విద్యార్థిని మాత్రమే అరెస్టైందని, తాము విద్యార్థులతో మాట్లాడిన తర్వాత వారు సంతృప్తి వ్యక్తం చేశారని డీజీపీ చెప్పారు.

BiggBoss 6 Day 14 : మరో ఎలిమినేషన్.. సండే తమన్నా స్పెషల్ ఎపిసోడ్..

కాగా, యూనివర్సిటీ అధికారులు తమను నియంత్రించాలని చూస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లో అమ్మాయిలకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే నిరసనల సందర్భంగా పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేశారని కూడా ఆరోపించారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మన్ విచారణకు ఆదేశించారు. నిరంతరం అధికారులతో సంప్రదిస్తున్నట్లు, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు భగవంత్ మన్ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటి క్యాంపస్‌ను సంప్రదించారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.