Speed Theft : రెప్పపాటు సమయంలో చైన్ లాగేసాడు

రెప్పపాటు సమయంలో మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు దొంగలు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీ రికార్డ్ అయింది.

Speed Theft

Speed Theft : మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే హత్య చేస్తున్నారు. తాజాగా రిక్షాలో ప్రయాణిస్తున్న మహిళ చేతిలోంచి మొబైల్ గుంజుకొని వెళ్లారు దొంగలు ఈ సమయంలో ఆమె రిక్షాలోంచి కిందపడటంతో తలకు బలమైన గాయమై మృతి చెందారు.

లోకల్ ట్రైన్ లో దొంగల చేతిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఇక తాజాగా అహ్మద్ నగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే చిట్లి రోడ్డులోని హుటాత్మా చౌక్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదే సమయంలో పల్సర్ బండిమీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని వేగంగా వెళ్లిపోయారు. రెప్పపాటు సమయంలో ఈ దొంగతనం జరిగింది. అక్కడ ఉన్నవారికి చాలా సేపు ఏం జరిగిందో కూడా తెలియదు.

తీరా మేడలో చూస్తే చైన్ కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో దొంగతనం క్లియర్ గా రికార్డు అయింది. ఫుటేజ్ సేకరించిన పోలీసులు దొంగలకోసం గాలింపు చేపట్టారు.