Sputnik Light Single Dose : కరోనా పోరులో ‘గేమ్‌ ఛేంజర్’.. జూలై నాటికి భారత్‌లో సింగిల్‌ డోసు టీకా వస్తోంది..!

భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటోంది.. దేశంలో అతికొద్దిరోజుల్లో సింగిల్‌ డోసు టీకా వస్తోంది. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారత్‌లో సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ఉత్పత్తితోపాటు పంపిణీ చేయాలని భావిస్తోంది.

Sputnik Light Single Dose : కరోనా పోరులో ‘గేమ్‌ ఛేంజర్’.. జూలై నాటికి భారత్‌లో సింగిల్‌ డోసు టీకా వస్తోంది..!

Sputnik Light May Be India's 1st One Dose Vaccine, Talks In June

Updated On : May 15, 2021 / 7:26 AM IST

Sputnik Light Single Dose : భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటోంది.. దేశంలో అతికొద్దిరోజుల్లో సింగిల్‌ డోసు టీకా వస్తోంది. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారత్‌లో సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ఉత్పత్తితోపాటు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తమ భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘స్పుత్నిక్‌ లైట్‌’ పేరుతో రష్యా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగ ఫలితాలు మే చివరిలో వెల్లడించే అవకాశం ఉంది. జులై నాటికి భారత్‌లో తొలుత స్పుత్నిక్‌ లైట్‌ టీకా అందుబాటులోకి రానుంది.

భారత్‌లో స్పుత్నిక్‌-V పంపిణీ చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్‌లో సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే కరోనా పోరులో ‘గేమ్‌ ఛేంజర్‌’గా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ‘స్పుత్నిక్‌ లైట్‌’ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ(DCJI) పరిశీలించనుంది. ఆ తర్వాతే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

రష్యా వ్యాక్సిన్‌కు భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామిగా ఉంది. భారత్‌లో ‘స్పుత్నిక్‌ లైట్‌’ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ‘స్పుత్నిక్‌ లైట్‌’కు 80శాతం సామర్థ్యం ఉందని తేలింది. రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆర్‌డీఐఎఫ్‌, ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ వ్యాక్సిన్‌ను రూపొందించింది. రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు వ్యాక్సిన్‌ 79.4శాతం ప్రభావంతంగా పనిచేసిందని ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది.