electric scooter ‘HOPE’: ఎలక్ట్రిక్ స్కూటర్.. రూపాయికే 5కిలోమీటర్లు..

indian electric scooter: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే.. 20పైసలు ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం స్కూటర్‌పై ఎలా చెయ్యగలమని అనుమానిస్తున్నారా? అవును రూపాయి ఖర్చుతో 5కిలోమీటర్లు పోయేలా ఢిల్లీకి చెందిన జెలియోస్ మొబిలిటీ అనే స్టార్టప్ కంపెనీ ఢిల్లీ ఐఐటీ సహకారంతో హోప్ పేరుతో ఎలెక్ట్రిక్ స్కూటర్ తయారు చేసింది.

బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్న రోజుల్లో మైలేజ్ వచ్చే బండ్లను కొన్నవారు కొంచం సేఫ్‌గా ఉంటామని భావిస్తున్నారు. మైలేజ్ రాని బండ్లను కొనుక్కుంటే పెట్రోల్, డీజిల్‌కు అయ్యే ఖర్చు సామాన్యునికి బారం అవుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే దేశంలో పలు చోట్ల ప్లాంట్‌లను ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన Geliose Mobility అనే స్టార్టప్ కంపెనీ తయారుచేసిన electric scooter ‘HOPE’‌పై అందరి దృష్టిపడింది. ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణ ఖర్చు కిలోమీటర్‌కు 20 పైసలు మాత్రమే. అంటే రూపాయి ఖర్చుతో ఐదు కిలోమీటర్లు పోవచ్చు అన్నమాట. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

మరొకటి 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్.. ఇక దీని ధర రూ. 46,999గా నిర్దారించింది కంపెనీ. దీనికి ఫెడల్ కూడా ఉంటుంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోతే సైకిల్ మాదిరి తొక్కుకుంటూ వెళ్లొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే సాధారణ కేబుల్‌తో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా డిజైన్ చేశారు. పోర్టబుల్ బ్యాటరీ సౌకర్యం కలదు. ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు