అయ్యప్ప మాలా వేసుకుని కాలినడకన స్వామివారి దగ్గరకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎదురైన కొత్త అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఓ శునకం.. అయ్యప్ప భక్తులతో 480 కిలోమీటర్లు నడిచిందట. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో అక్టోబర్ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు కాలినడకన బయల్దేరారు. వారితో పాటుగా నడక మొదలుపెట్టన ఆ శునకం మార్గం మధ్యలో వెళ్లిపోతుందేమో అనుకున్నారట.
కానీ వాళ్లు నడుస్తున్నా కొద్ది ఆ కుక్క కూడా వారితో నడుస్తూనే ఉందట. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ.. మేము మా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు తాము 480 కిలోమీటర్లు నడిచామని.. వారితో పాటుగా ఆ కుక్క కూడా అన్ని కిలో మీటర్లు నడిచిందని తెలిపారు. తాము తెచ్చుకున్న ఆహారాన్ని ఆ కుక్కకు కూడా పెట్టామని చెప్పారు.
ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన చాలామంది భక్తులు వెళ్తుంటారు. ఇలాంటి వింత అనుభవం ఎప్పుడు ఎవరికి జరగుండదు. కానీ మాకు ఈ కుక్క తమ వెంట నడక సాగించడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH Karnataka: A stray dog has been following a group of 13 Ayyappa devotees, who are on a pilgrimage to Kerala’s Sabarimala & has walked 480 km so far. The devotees started from Andhra Pradesh’s Tirumala on Oct 31 & have reached Chikkamagaluru dist’s Kottigehara now. (17.11) pic.twitter.com/9ke8uFwRCt
— ANI (@ANI) November 18, 2019