పవార్ పవర్ : 50 ఏళ్లుగా ఓటమి ఎరుగని నేత

ముంబై: రాజకీయాల్లో రాటు తేలిన సీనియర్ నాయకులు ఎందరో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోయిన అతిరథ మహారథులు పాలిటిక్స్ లో తల పండిన నేతలు చాలా మందే ఉన్నారు. రాజకీయ జీవితంలో..50 ఏళ్లకు పైబడిన అనుభవం…ఎన్నిక్లలో 14 సార్లు పోటీచేసినా ఓటమినెరుగని ఘనత అతని ఈ ఘనత శరద్ పవార్ సొంతం.
అందుకే శరత్ పవార్ ను రాజకీయాల్లో మహారధి రాజకీయ విశ్లేషకులు సైతం అభివర్ణిస్తుంటారు. 1967లో రాజకీయాల్లోకి వచ్చిన శరద్ పవార్ నాలుగుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని పదవికి అర్హుల జాబితాలోరూ శరద్ పవార్ పేరు పలుమార్లు వినిపించింది కూడా. 1940, డిసెంబరు 12న ఆయన పూణెలో జన్మించిన పవార్ కామర్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. 1967లో కాంగ్రెస్ తరపున బారామతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి.. విజయం సాధించారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో 2014లో ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని శరద్ పవార్ నిర్ణయించుకున్నారు.
మూడుసార్లు మహారాష్ట్ర సీఎంగా, 6సార్లు లోక్ సభ ఎంపీగా..కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా..బీసీసీ ఐ ప్రెసిడెంట్ గా..ఎన్నో ఉన్నత పదవుల్ని అలంకరించిన శరత్ పవార్ ఇప్పటి వరకూ 14 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచా 15వ సారి పోటీ చేసి గెలవగలను కానీ తరువాత తరాలవారికి అవకాశమివ్వాలని శరత్ పవార్ భావించారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తెలిపారు. 2005 నుంచి 2008 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ బిసిసిఐ ఛైర్మన్ గా..2010 నుండి 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందారు శరత్ పవార్.