Sudarsan Pattnaik : క్రిస్మస్ పర్వదినాన పూరి బీచ్‌లో శాంతాక్లాజ్ సైకత శిల్పం

Sand sculpture of Santa Claus: సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్ సైకతశిల్పాన్ని రూపొందించారు. ‘‘గిఫ్ట్ ఎ ప్లాంట్, గ్రీన్ ద ఎర్త్’’ అనే సందేశంతో పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ ఉల్లిపాయలను ఉపయోగించి శాంతాక్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు....

Santa Sculpture

సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్ సైకతశిల్పాన్ని రూపొందించారు. ‘‘గిఫ్ట్ ఎ ప్లాంట్, గ్రీన్ ద ఎర్త్’’ అనే సందేశంతో పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ ఉల్లిపాయలను ఉపయోగించి శాంతాక్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ భారీ శిల్పాన్ని తయారు చేయడానికి ఇసుకతోపాటు రెండు టన్నుల ఉల్లిపాయలను ఉపయోగించానని సుదర్శన్ పట్నాయక్ చెప్పారు.

ALSO READ : Married : సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి

ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బీచ్ లో విభిన్న సైకత శిల్పాలను రూపొందించే సుదర్శన్ పట్నాయక్ తాజాగా ఉల్లి, ఇసుకతో శాంతాక్లాజ్ శిల్పాన్ని రూపొందించారు. 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉన్న ఈ సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒడిశా ఇసుక కళాకారుడు మరిన్ని మొక్కలు నాటడం ఆవశ్యకతను సైకతశిల్పంలో పేర్కొన్నాడు. దీంతో శిల్పంలో ఉల్లిపాయలు వాడారు. దేశవ్యాప్తంగా అర్ధరాత్రి ప్రార్థనలతో దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది.

ALSO READ : Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

క్రిస్మస్ ఈవ్ సందర్భంగా శ్రీనగర్‌లోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చి రంగురంగుల లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. సుదర్శన్ పట్నాయక్ గతంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత జట్టుకు, దీపావళి సందర్భంగా రాముడికి శుభాకాంక్షలు చెపుతూ సైకతశిల్పాలను రూపొందించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు ఒడిశా ఇసుక కళాకారుడు జై హో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు.

ALSO READ : YS Sharmila : వెరీ ఇంట్రస్టింగ్.. షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన నారా లోకేశ్.. ఎందుకో తెలుసా

క్రిస్మస్ సందర్భంగా ముంబయిలోని సెయింట్ మైకేల్స్ చర్చిలో అర్ధరాత్రి ప్రార్థనలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రిస్మస్ పండుగ సందర్భంగా కేథడ్రల్ ఆఫ్ ది మోస్ట్ హోలీ రోసరీలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్యాథలిక్ చర్చిలో, బెంగళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కేథడ్రల్‌లో అర్ధరాత్రి ప్రార్థనలు జరిగాయి.