సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన నటుడు అర్బాజ్ ఖాన్ వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు....| Arbaaz Khan and Shura Khan are now married

Arbaaz Khan, Shura Khan
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన నటుడు అర్బాజ్ ఖాన్ వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు. ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను మొదటిసారి పాట్నా శుక్లా సెట్స్ లో కలిశారు.
ALSO READ : Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
ఈ వివాహ వేడుకలో సోదరులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మా ఖాన్,కుమారుడు అర్హాన్ ఖాన్‌తో సహా మొత్తం కుటుంబం పాల్గొంది. వధువు షురా ఖాన్‌తో సన్నిహిత బంధాన్ని పంచుకున్న స్నేహితురాలు రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా టాండన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ALSO READ : YS Sharmila : వెరీ ఇంట్రస్టింగ్.. షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన నారా లోకేశ్.. ఎందుకో తెలుసా
అర్బాజ్ ఖాన్ గతంలో మలైకా అరోరాను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ 2016వ సంవత్సరం మార్చిలో విడిపోతున్నామని ప్రకటించారు. 1998వ సంవత్సరంలో వివాహం చేసుకున్న అర్బాజ్, మలైకా 19 సంవత్సరాల తర్వాత 2017 మే 11వతేదీన అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram