Sukesh Chandrasekhar
Sukesh Chandrasekhar: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సుకేశ్ చంద్ర శేఖర్ మరో లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్ర శేఖర్ తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. తన అడ్వకేట్ ద్వారా సుకేశ్ లేఖను విడుదల చేశారు. జైలు నుంచి రాతపూర్వకంగా సుఖేశ్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని అడ్వకేట్ కోరారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
“కేజ్రీవాల్ తన నివాసం కోసం వ్యక్తిగతంగా అత్యాధునిక ఫర్నిచర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇద్దరు కలిసి నాతో వాట్సాప్ లో ఫర్నిచర్ ఫొటోలు సెలెక్ట్ చేసి షేర్ చేశారు. కేజ్రీవాల్ కోసం ఫర్నిచర్ ను నేనే కొనుగోలు చేశాను.
12 సీట్ల డైనింగ్ టేబుల్ 45 లక్షల రూపాయలు. రూ.34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్స్, రూ.18 లక్షలతో అద్దాలు, రూ.28 లక్షలతో బెడ్ రూం సామగ్రి, రూ.45 లక్షలతో గోడ గడియారాలు తీసుకున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్ కొనుగోలు చేశాం.
నా సిబ్బంది రిషబ్ శెట్టి ద్వారా కేజ్రీవాల్ అధికారిక నివాసంలో డెలివరీ చేశాం. ఫర్నిచర్ కు సంబంధించిన అన్ని బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందించాను. కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలి” అని సుకేశ్ కోరారు.
Karnataka Polls: ఖర్గే హత్యకు బీజేపీ ప్లాన్.. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.. స్పందించిన సీఎం