Aditya L1
Aditya-L1- ISRO: అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచం గుర్తిస్తోంది. గత ఏడాది చంద్రయాన్-3ను జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి దేశం తలెత్తుకునేలా చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ .. అనంతరం ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. 2023 సెప్టెంబర్ 2న పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్య ఎల్-1ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు 63 నిమిషాలు పట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్-1 విజయవంతంగా విడిపోయింది.
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది ఇస్రో. ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి వెళ్లేందుకు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది. మొదట ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఏ రోజు ఏం జరిగింది?
The SUIT payload captures full-disk images of the Sun in near ultraviolet wavelengths
ఏం జరగనుంది?
సౌర మండలంలోని గాలులు, కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి
ఎల్-1 నుంచి అధ్యయనం చేస్తే ఆటంకాలు ఏవీ ఎదురుకావని ఇస్రో భావిస్తోంది. కొన్ని వేల కిలోమీటర్ల వరకు భానుడి కరోనా ఉంటుంది. దాని ఉష్ణోగ్రత స్థాయి సుమారు 10 లక్షల డిగ్రీల కెల్విన్ డిగ్రీలు.. భానుడి లోపలి ఉష్ణోగ్రత దాదాపు 6 వేల కెల్విన్ డిగ్రీలు.
ఆదిత్య ఎల్1 చేరుకునే ప్రాంతాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారని ఇస్రో ఇప్పటికే వివరించింది. అక్కడకు ఆదిత్య ఎల్1 చేరుకున్న తరువాత మరోసారి ఇంజిన్ మండిస్తారు. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్1 కేంద్రంలో స్థిరపడుతుంది. అనంతరం కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుంది. ఐదేళ్ల పాటు సమాచారాన్ని సేకరిస్తుంది. భానుడిలో వచ్చే మార్పులు, సకల ప్రాణుల జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది.
PSLV-C58 : నూతన ఏడాది ఇస్రో విజయోత్సాహం.. పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం విజయవంతం..