PSLV-C58 : నూతన ఏడాది ఇస్రో విజయోత్సాహం.. పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం విజయవంతం..

తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

PSLV-C58 : నూతన ఏడాది ఇస్రో విజయోత్సాహం.. పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం విజయవంతం..

Isro PSLV-C58 Rocket

Updated On : January 1, 2024 / 10:17 AM IST

PSLV-C58 Rocket : చంద్రయాన్-3, ఆదిత్య – ఎల్1 ప్రతిష్టాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించిన 2023 ఏడాదిని ఘనంగా ముగించిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది 2024 సంవత్సరం తొలిరోజు పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగాన్ని చేపట్టింది. పీఎస్ఎల్వీ -సీ58 రాకెట్ ద్వారా ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహంను (ఎక్స్‌పోశాట్‌) ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8.10గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి ఎగిరింది. నింగిలోకి దూసుకెళ్లిన 21 నిమిషాలకు ఎక్స్ పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. దీంతో 2024 సంవత్సరాన్ని ఇస్రో విజయంతో ప్రారంభించింది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో ఈ ప్రయోగం 60వది కావటం విశేషం.

Also Read : PSLV-C58: కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా.. మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్‌ షురూ

పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 480 కిలోల బరువుగల ఎక్స్‌పోశాట్‌ ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తరువాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్ పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే. ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి ఇది నాందికానుంది. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్-రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్ పై అధ్యయనం ద్వారా కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్ కు సంబంధించిన వివరాలను ఎక్స్ పోశాట్ బహిర్గతం చేయనుంది. అమెరికాకు చెందిన నాసా 2019లో చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఎక్స్‌పీఈ) తరువాత మరో దేశం చేపడుతున్న పోలారిమెట్రీ మిషన్ ఇదే కావడం గమనార్హం.

Also Read : ISRO: ఇస్రో దూకుడు.. మరో సరికొత్త ప్రయోగానికి ప్రణాళికలు.. 2040 కల్లా టార్గెట్ పూర్తిచేసేలా చర్యలు

ప్రయోగం వియవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. కొత్త ఏడాది కొత్త విజయాన్ని అందుకున్నాం, ఎక్స్ పోశాట్ ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని ఇస్రో చైర్మన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేపడతామని చెప్పారు. మిషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సైన్స్ రంగంలో మహిళాసాధికారతను ప్రదర్శిస్తుందని అన్నారు.