ISRO: ఇస్రో దూకుడు.. మరో సరికొత్త ప్రయోగానికి ప్రణాళికలు.. 2040 కల్లా టార్గెట్ పూర్తిచేసేలా చర్యలు

2040 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.

ISRO: ఇస్రో దూకుడు.. మరో సరికొత్త ప్రయోగానికి ప్రణాళికలు.. 2040 కల్లా టార్గెట్ పూర్తిచేసేలా చర్యలు

isro

ISRO Chairman Somanath : చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలచూపు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వైపుకు మళ్లింది. ఇస్రోసైతం మరింత దూకుడుగా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో 2040 నాటికి తొలి సారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తోంది. దీనికికోసం ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే రోదసి యాత్రలకోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేసింది. అన్నీసక్రమంగా జరిగితే ఇస్రో అనుకున్న సమయానికి సరికొత్త గమ్యాలను చేరుకుంటుంది.

Also Read : CM Mohan Yadav : మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న 11 రాష్ట్రాల సీఎంలు

మనోరమ ఇయర్ బుక్ 2024కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2040 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు, వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని వివరించారు. గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని సోమనాథ్ చెప్పారు. దీనికింద ఇద్దరు, ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూ కక్ష్యలోకి పంపుతామని అన్నారు. వీరంతా బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారని సోమనాథ్ తెలిపారు.

Also Read : ISRO Chandrayaan-3 : అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. భూ కక్ష్యకు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మళ్లింపు

మానవ -రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (HLVM3), క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ తో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని గగన్‌యాన్‌ కలిగి ఉంటుంది. క్రూ మాడ్యూల్ భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వ్యోమగాములు తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించడానికి అనుమతిస్తుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఇది వ్యోమగాములు ప్రమాదానికి గురైనప్పుడు అంతరిక్ష నౌక నుంచి తప్పించుకోవడానిక అనుమతిస్తుంది.

Also Read : How to Join ISRO After 12th : ఇస్రోలో సైంటిస్ట్ కావాలని కలలు కంటున్నారా ? అది సాధ్యం కావాలంటే ఇంటర్‌ తర్వాత..

21అక్టోబర్ 2023న గగన్ యాన్ ప్రోగ్రామ్ లోని మొదటి అన్ క్రూడ్ ప్లైట్ మిషన్ ను ప్రారంభించింది. టెస్ట్ వెహికల్ డెవలప్ మెంట్ ప్లైట్ (TV-D1), టెస్ట్ వెహికల్ అబార్ట్ ప్లైట్ అని పిలుస్తారు. ఈ మిషన్.. సిబ్బందిలేని క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను మోసుకెళ్లింది. ఆంద్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరింది. గగన్ యాన్ లో TV-D1 ఒక ముఖ్యమైన మిషన్.. ఎందుకంటే ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ప్రదర్శించింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క విమానంలో అబార్డ్ ప్రదర్శించబడింది. అంటే క్రూ మాడ్యూల్ గాలిలో ఉన్నప్పుడు, క్రూ ఎస్కేప్ సిస్టమ్ తొలగించబడింది. బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ కూలిపోయి విజయవంతమైంది. 2025లో ప్రారంభం కానున్న మానవ అంతరిక్ష యాత్రకు, అంతిమ మానవ అంతరిక్ష యాత్రకు టెస్ట్ వెహికల్ డెవలప్ మెంట్ ప్లైట్ (TV-D1) విజయం చాలా కీలకమని సోమనాథ్ వ్యాసంలో రాశారు.

Also Read : Hamas Tunnels : గాజాలోని హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటి పంపింగ్

మరోవైపు 2035 నాటికి అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక లక్ష్యాలను నిర్దేశించారని సోమనాథ్ తెలిపారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఖ్యాతి మరింత పెంచేందుకు శుక్రుడు, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని మోదీ సూచించారని అన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు లో ఇస్రో ఖ్యాతి మరింత ఉన్నత శిఖరాలకు చేరగలదని సోమనాథ్ పేర్కొన్నారు.