UP Constable Exam 2024 : యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫొటో..! సోషల్ మీడియాలో వైరల్
యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షల అడ్మిట్ కార్డ్ లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ చిత్రం ...
- Harishth Thanniru
- Published On : February 18, 2024 / 11:49 AM IST
Sunny leone
Sunny leone : బాలీవుడ్ నటి సన్నీలియోన్ అంటే తెలియని కుర్రకారు ఉండరు.. సినిమాల్లో తనదైన రీతిలో శృంగార సన్నివేశాల్లో నటించి యువకుల మనస్సులను కొల్లగొట్టింది.. ప్రస్తుతం ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫొటో చక్కర్లు కొడుతుంది. దీనంతటికీ కారణం యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ పరీక్ష. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష జరిగింది. 75 పరీక్షా కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు. కన్నౌజ్ జిల్లాలో మొదటి రోజు పది పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
Also Read : Shubman Gill : అయ్యో గిల్.. కుల్దీప్ ఎంత పని చేశావయ్యా..
కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలోని బాలికల కళాశాల పరీక్షా కేంద్రంలో అభ్యర్థి అంకిత్ అడ్మిట్ కార్డ్ లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ చిత్రం ముద్రించబడింది. అంకిత్ చిత్రానికి బదులుగా సన్నీలియోన్ ఫొటో ఉండటంతో.. అడ్మిట్ కార్డును కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అడ్మిట్ కార్డు గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అడ్మిట్ కార్డులో రాసిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా.. విద్యార్థి అంకిత్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ నుంచి ఫారమ్ ను నింపినట్లు చెప్పారు. అయితే, ఆ ఫొటోను ఎలా మార్చారనే విషయం మాత్రం తెలియరాలేదు.
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు.. విచారణకు రావాలని కోర్టు నోటీసులు
ఈ అడ్మిట్ కార్డ్ లో పేర్కొన్న చిరునామా ముంబైది. రిజిస్ట్రేషన్ సమయంలో సొంత జిల్లాను కన్నౌజ్‌గా పేర్కొన్నారు. ఈ అడ్మిట్ కార్డుపై అభ్యర్థులెవరూ పరీక్షకు హాజరు కాలేదని కళాశాల అధికారులు తెలిపారు. విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అడ్మిట్ కార్డులో ఎడిటింగ్ జరిగిందని చెప్పారు. మిగిలిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరినీ వదిలిపెట్టబోమని అధికారులు చెప్పారు.
#SunnyLeone उत्तर प्रदेश पुलिस भर्ती परीक्षा में सनी लियोनी के नाम का एडमिट कार्ड सोशल मीडिया पर वायरल हो गया जी हां आपको बता दें कि उत्तर प्रदेश में पुलिस भर्ती परीक्षा चल रही है शरारती तत्वों ने सनी लियोनी का भी एडमिट कार्ड बना दिया pic.twitter.com/nRBm2UF1sk
— Somendra ji (@ji_somendra) February 18, 2024
