Supreme Court To Take Up Pleas Against Hijab Verdict After Holi
Supreme Court to take up pleas against hijab verdict after Holi : కర్ణాటక విద్యాసంస్థల్లో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లిం విద్యార్ధినిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ విషయమై దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం (మార్చి16,2022) పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు.
Also read : Hijab Row: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు
కాగా కర్ణాటకలోని విద్యాసంస్థల్లో చెలరేగిన హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇది పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ వివాదం గురించి తమకు న్యాయం చేయాలని తమ సంప్రదాయం ప్రకారం హిజాబ్ ధరించి వస్తే విద్యాసంస్థల్లోకి రావటానికి అనుమతి ఇవ్వటంలేదని మా సంప్రదాయం ప్రకారంగా వస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తు ముస్లిం విద్యార్థినిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొంతకాలం కొనసాగించిన హైకోర్టు ఎట్టలకేలకు తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం విద్యార్థినులకు నిరాశ కలిగించేలా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ఇస్లాం ప్రకారం హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని..విద్యాసంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కర్ణాటక హైకోర్టు ఇచ్చింది. విద్యార్ధులు దాఖలు చేసుకున్న పిటీషన్లను జస్టిస్ రితురాత్ అవస్థీ, జస్టిస్ కృష్ణ, జస్టిస్ జైబున్నీసా ఎం వాజీలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అటు ఈ తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కల్గించేలా ఉందని తెలిపారు. తాము కూడా సుప్రీంకోర్టుకు వెళతామని ఇప్పటికే వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్‌లో స్పష్టంగా ఉన్నప్పుడు..ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. అటు ఈ తీర్పుకు వ్యతిరేకంగా కర్ణాటకలో పలు ప్రాంతాల్లో విద్యార్ధులు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ ముఖ్యమని..ధరించి తీరుతామన్నారు.
Also read : Hijab Row : ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..!
ఇటు ఇదే అంశంపై కర్ణాటక హైకోర్చు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. హోలీ పండుగ సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ స్పష్టం చేశారు. కొందరు విద్యార్ధుల తరపున అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. రానున్న పరీక్షల్ని దృష్టిలో ఉంచుకుని..వెంటనే ఈ అంశంపై విచారణ చేపట్టాలని పిటీషనర్ కోరారు. దీనిపై జస్టిస్ ఎన్ వి రమణ స్పందించారు. విద్యాసంస్థల్లో హిజాబ్ అంశంపై ఇంకొన్ని పిటీషన్లు ఉన్నాయని..హోలీ అనంతరం విచారణ చేపడతామని చెప్పారు.
ఇప్పటికే కర్ణాటక హైకోర్టు తీర్పుపై ముస్లిం సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిజాబ్ ధరించవద్దని చెప్పడం ఒకరి మత విశ్వాసాలకు విఘాతం కల్గించడమేనని వాదనలు వస్తున్నాయి. ఖురాన్‌లో స్పష్టంగా ఈ అంశంపై ప్రస్తావన ఉన్నప్పుడు..హైకోర్టు ఇస్లాంలో తప్పనిసరి కాదని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తోందని చెబుతున్నారు.