Hijab Row: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు

కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. హిజాబ్ వివాదంపై పలు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు.. మంగళవారం తీర్పు విడుదల చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా

Hijab Row: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు

Hijab Row

Hijab Row: కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. హిజాబ్ వివాదంపై పలు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు.. మంగళవారం తీర్పు విడుదల చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉడుపిలోని ఆరుగురు ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టులోని అపెక్స్ కోర్టును ఆశ్రయించి న్యాయం కావాలని అభ్యర్థించనున్నారు.

ముస్లిం విద్యార్థి నిబా నాజ్ తరపున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. కర్నాటక విద్యా చట్టం ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సూచించలేదని, హిజాబ్ ధరించే హక్కు.. గోప్యత హక్కు పరిధిలోకి వస్తుందని పిటిషనర్లు పేర్కొనగా.. హైకోర్టు తమకు న్యాయం చేయలేదని వెల్లడించారు.

మతస్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛలను సృష్టించడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, మతాన్ని అనుసరించే వారికి మనస్సాక్షి హక్కు ఉండదని కోర్టు భావించిందని పిటిషనర్లు పేర్కొన్నారు.

Read Also : ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..!

కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. హిజాబ్ ధరించడంలో ఇస్లాంలో తప్పనిసరేం కాదని తెలిపారు. కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లన్నింటినీ కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు యూనిఫాం ధరించడంపై ఆంక్షలు సహేతుకమైనవని, విద్యార్థులు దీనిని వ్యతిరేకించలేరంటూ తీర్పునిచ్చింది.

సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. పిల్లలకు విద్య అనేది ముఖ్యమని హైకోర్టు ఆర్డర్ పాటించాలని, శాంతంగా, ప్రశాంతంగా ఉండాలని సూచించారు.