రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లు : కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

  • Publish Date - April 30, 2019 / 12:07 PM IST

ఢిల్లీ : రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శనివారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరుగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. 

రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వీటిని ప్రచురించింది. వాటి ఆధారంగా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ పత్రాల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోరారు. అయితే రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగిలించి వాటి నకలును కోర్టుకు ఇచ్చారని, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును సమీక్షించడం సరికాదని కేంద్రం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్రం అభ్యంతరాలను కొట్టివేసింది.