Site icon 10TV Telugu

motor vehicle tax : ఆ వాహనాలకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.. సుప్రీంకోర్టు తీర్పు..

motor vehicle tax

motor vehicle tax

motor vehicle tax : ఏదైనా వాహనాన్ని పబ్లిక్ రోడ్లపై (ప్రభుత్వ మౌలిక సదుపాయాలైన రహదారులు, జాతీయ రహదారులు) నడిపినందుకు మోటార్ వెహికల్ ట్యాక్స్ కట్టాలనే నిబంధన మన దేశంలో ఉంది. దీన్ని రోడ్ ట్యాక్స్ కూడా అంటారు. ఇది రోడ్డు మెయింటెనెన్స్ ఫీజుగా ఉపయోగపడుతుంది. అయితే, వెహికల్‌ను పబ్లిక్ ప్లేస్‌లో వాడనప్పుడు దానిపై ఎటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Also Read: ECIL: ఐటీఐ పూర్తి చేశారా.. ఈసీఐఎల్ లో 412 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ ట్యూక్సేషన్ చట్టం -1963 కింద మోటారు వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పబ్లిక్ ప్లేసెస్‌లో వాహనం నడపకుండా, కేవలం ప్రైవేట్ స్థలాలకు పరిమితమైతే సదరు వాహన యాజమాని పన్ను చెల్లించనక్కర్లేదని జస్టిస్ మనోజ్ మిశ్రా, ఉజ్వల్ భయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

 

అసలు ఈ కేసు ఏమిటి..?

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) క్యాంపస్ లో ఈ కంపెనీకి చెందిన భారీ వాహనాలు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సెంట్రల్ డిస్పాచ్ యార్డులో మాత్రమే తిరిగేవి. ఆ వాహనాలు ఎప్పుడూ క్యాంపస్ గేటు దాటి బయటకు రాలేదు. దీంతో పబ్లిక్ ప్లేసెస్ లో వాహనాలను వినియోగించడం లేదని, కాబట్టి మోటారు వాహనాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ అధికారులను సంస్థ కోరింది. ఈ విషయంపై ఏపీ హైకోర్టుకు వెళ్లింది. పబ్లిక్ ప్లేసెస్ లో వాహనాలు నడపం లేదన్న సంస్థ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో సంస్థ కట్టిన పన్ను సొమ్మును తిరిగి చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో వాహనాన్ని నడపకపోతే, ఆ కాలానికి సదరు వాహన యాజమానిపై మోటారు వాహనాల పన్ను భారం మోపడం సరికాదని జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్టం 1963 లోని పబ్లిక్ ప్రదేశాలను నిర్వచించే నిబంధన 3ను ఉటంకిస్తూ ఈ పదాన్ని ఆలోచించే చట్టంలో ఉంచారని ధర్మాసనం తెలిపింది.

Exit mobile version