CAA అమలుపై స్టే కి సుప్రీం నిరాకరణ

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ

  • Publish Date - January 22, 2020 / 07:01 AM IST

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ అమలుపై స్టే ఇవ్వలేము అని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరపున వాదనలు వినకుండా సీఏఏపై స్టే ఇవ్వలేము అని స్పష్టం చేసింది. ఈ అంశంపై విస్తృత రాజ్యాంగ ధర్మాసనం వద్దకు వెళ్లాలని కోర్టు సూచించింది. ఈ మేరకు పిటిషన్ల విచారణకు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. సీఏఏని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను 5 వారాల తర్వాత రాజ్యాంగ ధర్మాసం విచారిస్తుందని, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని.. అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. మరోవైపు సీఏఏపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా సీఏఏపై 140 పిటిషన్లు దాఖలయ్యాయి. అసోంలో ఎన్ సీఆర్ పై ప్రత్యేక విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల హక్కులను కాలరాస్తుందని పలు పార్టీలు కోర్టుని ఆశ్రయించాయి. సీఏఏని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేశాయి. దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు సుప్రీం కోర్టులో దాదాపు 143 పిటిషన్లు దాఖలు చేశాయి. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలని కోరుతున్నాయి. ఓవైపు నిరసనలు, ఆందోళనలు హోరెత్తుతున్నా.. కేంద్రం మాత్రం తగ్గలేదు. జనవరి 10 నుంచి సీఏఏని అమల్లోకి తెచ్చింది. 

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంలో పిటిషన్ వేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ కూడా సుప్రీంను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఎవరెన్ని ఆందోళనలు చేసినా సీఏఏపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చేది.. లాక్కునేది కాదని చెప్పారు. మైనార్టీల రక్షణ కోసమే సీఏఏ తీసుకొచ్చామని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది. ఓట్ల కోసం విపక్షాలు స్వార్థ రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.