Supreme Court
గవర్నర్లకు ఉండే అధికారాల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ ల్యాండ్‌మార్క్ లాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా అట్టిపెట్టుకోవడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీఎం సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి ఈ విషయంలో భారీ విజయం సాధించినట్లయింది.
అసలు ఏం జరిగింది?
అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను సాధారణంగా గవర్నర్ ఆమోదానికి పంపుతారు. ఆ తర్వాత గవర్నర్ వాటికి ఆమోదముద్ర వేస్తారు. అయితే, తమిళనాడు అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారని ఆ రాష్ట్ర సర్కారు 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బిల్లులను గవర్నర్ వద్దకు తాము పంపుతుండగా, ఆయన వాటిపై ఎటువంటి సమాధానమూ ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచుకుంటున్నారని తమిళనాడు సర్కారు చెప్పింది. బిల్లులకు ఆమోదముద్ర వేయడం లేదని లేదంటే కనీసం పునఃపరిశీలన కోసం కూడా వెనక్కి పంపడం లేదని పేర్కొంది.
రెండోసారి ఆమోదించిన బిల్లుల అంశంలోనూ గవర్నర్ ఇలాగే ప్రవర్తిస్తున్నారని చెప్పింది. దీంతో విచారణ జరిపిన ప్రభుత్వం ఇవాళ తీర్పునిస్తూ.. పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని గవర్నర్ ఆర్ఎన్ రవి భావించిన తీరు చట్టవిరుద్ధమే కాక ఏకపక్షమని తెలిపింది.
గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత.. దాన్ని అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన అనంతరం రెండోసారి వాటిని రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు చేయొద్దని స్పష్టం చేసింది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే భావించాలని తెలిపింది.
రాష్ట్రపతికి వాటిని పంపాలని అనుకుంటే 30 రోజుల్లోగానే దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అలాగే, రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదని భావిస్తే మూడు నెలల్లోగా వాటిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. శాశ్వతంగా గవర్నర్ వాటిని అట్టిపెట్టుకోకూడదని స్పష్టం చేసింది.