వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్‌పై పెరిగిన రూ.50 వీళ్లు కట్టక్కర్లేదు.. వీళ్లకి రూ.500కే గ్యాస్
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.

Gas Cylinder Price
దేశంలో వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై) ధరపై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం తెలంగాణలో సర్కారు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులపై పడదు.
మిగతా అందరు ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులపై పడుతుంది. కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.855 నుంచి రూ.905కు పెరిగింది.
Also Read: మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కొడుకుపై చంద్రబాబు, జగన్ ట్వీట్స్
తెలంగాణలో 130 లక్షల మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉన్నారు. 39 లక్షల మంది మహాలక్ష్మి పథక లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం కింద వారికి సర్కారు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది.
హైదరాబాద్ గ్యాస్ వినియోగదారులకు తెలంగాణ సర్కారు రూ.405 భరిస్తుంది. అలాగే, తెలంగాణ మరో 11 లక్షల మందికి ఉజ్వల పథకం అమలవుతోంది. ఉజ్వల కింద అందించే 14.2 కిలోల ఎల్‌ల్పీజీ సిలిండ్ ధర 500 నుంచి రూ.550కి పెరిగింది. ఇక తెలంగాణలోని ఇతర 91 లక్షల మంది ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులపై పెరిగిన ధరల ప్రభావం పడుతుంది.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో వరంగల్‌లో గ్యాస్ ధర రూ. 924, కరీంనగర్‌లో రూ.928.50, నిజామాబాద్‌లో రూ.928.50, వికారాబాద్‌లో రూ.922, జగిత్యాలలో రూ.925గా ఉంది.