మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కొడుకుపై చంద్రబాబు, జగన్ ట్వీట్స్

లోకేశ్, కేటీఆర్ కూడా స్పందించారు.

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కొడుకుపై చంద్రబాబు, జగన్ ట్వీట్స్

Ys Jagan

Updated On : April 8, 2025 / 2:23 PM IST

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు.

దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. “సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు.

దీనిపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్ స్పందిస్తూ.. “సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌ గాయపడ్డాని తెలిసి నేను షాక్ అయ్యాను. మార్క్ శంకర్‌ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

Also Read: పెద్ద భూ కుంభకోణం.. ఒక బీజేపీ ఎంపీ కూడా.. 3 రోజుల్లో బయటపెడతా..

పవన్ కుమారుడికి అయిన గాయాలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. “సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయని తెలుసుకుని షాక్ అయ్యాను. అతడు త్వరగా కోలుకోవలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు.