Shot Momos : కాలేజీ అమ్మాయి కొత్త వంటకం “షాట్ మోమోస్”.. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు కష్టపడుతూ..

ఇటీవల కాలంలో రకరకాల ఫుడ్‌లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కొత్త వంటలు కనిపెట్టేవారు కొందరు.. పాతవాటికి మరింత క్రియేటివిటీ జోడించేవారు ఇంకొందరు. సూరత్ కి చెందిన ఓ కాలేజీ అమ్మాయి 'షాట్ మోమోస్‌'కి భలే క్రేజ్ వచ్చింది.

Shot Momos new recipe

Shot Momos new recipe : క్రియేటివిటీ.. కష్టం రెండూ ఉంటే ఏ పనిలో అయినా విజయం సాధిస్తాం. ఓ కాలేజీ అమ్మాయి చదువుకుంటోంది.. మరోవైపు రోడ్ సైడ్ కష్టపడి తాను తయారు చేసిన కొత్త రకం మోమోస్ విక్రయిస్తోంది. అవే “షాట్ మోమోస్” (shot momos). వీటి కథేంటో చదవండి.

Mud Puddling : బురద నుంచి సాల్ట్ సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో వైరల్

సూరత్‌కి (surat) చెందిన ఓ అమ్మాయి ఓ వైపు చదువుకుంటూ మోమోస్ వ్యాపారం చేస్తోంది. అయితే రెగ్యులర్ గా విక్రయించే వాటికి కాస్త క్రియేటివిటీని జోడించింది. తాను తయారు చేసిన మోమోస్ కి ‘షాట్ మోమోస్’ అని పేరు పెట్టింది. బౌల్స్ లాగ తయారు చేసిన మోమోస్ మధ్యలో గ్రీన్ చట్నీ (green chutney), రెడ్ చట్నీ (red chutney), టోమోటో చట్నీ(tomato chutney), మయోన్నైస్ తో (mayonnaise) ఫిల్లింగ్ చేసి మోమోస్ కి కొత్త లుక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొత్త టైప్ మోమోస్ ని తినడానికి జనం తెగ ఇష్టపడుతున్నారు. ఆమె దుకాణం ముందు క్యూ కడుతున్నారు. ఇక ఈ మోమోస్ షాపు దుకాణంకి సంబంధించిన వీడియోను ఫుడ్ వ్లాగర్ thehungrysurati వీటిని ఎప్పుడైనా టేస్ట్ చేసారా? అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాపారం బాగా సాగాలని కొందరు.. మోమోలను వండి వాటిని కష్టమర్స్ కి చిరునవ్వుతో అందించడం మరింత నచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కష్టానికి తోడు లక్ కలిసి వస్తే ఈ అమ్మాయి రోడ్ సైడ్ వ్యాపారం కాస్త పెద్ద హోటల్ స్ధాయికి ఎదిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.