Surat : చావు ఎలా వస్తుందో తెలియదు..కుప్పకూలిన యువకుడు, వీడియో వైరల్

అప్పటి వరకు బాగానే ఉన్న ఓ 33 ఏళ్ల యువకుడు..కూర్చొని..కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది.

Gym

Surat Gold Gym : చావు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏరకంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు సైతం హఠాత్తుగా చనిపోవడంతో అందరూ దిగ్ర్భాంతికి గురవుతుంటారు. రెప్పపాటు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా..ఇలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటి వరకు బాగానే ఉన్న ఓ 33 ఏళ్ల యువకుడు..కూర్చొని..కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది.

Read More : Emotional Tribute to Late Wife: అమ్మతనానికి గుర్తుగా.. అమ్మ జ్ఞాపకంగా ఫొటోషూట్

సూరత్ గోల్డ్ జిమ్ లో 33 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తుంటాడు. ప్రతి రోజులాగానే..వ్యాయామం చేశాడు. చాలా సేపు ఎక్సర్ సైజ్ చేశాడు. అనంతరం ఏదో నొప్పిగా ఉన్నట్లు అనిపియడంతో జిమ్ నుంచి బయటకు వచ్చి…అక్కడున్న మెట్లపై కూర్చొన్నాడు. గుండెలో మంటగా అనిపించడంతో లోనికి వెళ్లి..నీళ్ల బాటిల్ తెచ్చుకుని తాగాడు. అనంతరం మరలా అక్కడనే కూర్చొన్నాడు. ఏదో భాదతో అల్లాడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. గుండెపై చేయి వేసుకున్న అతను..అమాంతం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Read More :Drugs Case: నేడు ఈడీ ముందుకు చార్మీ.. కెల్విన్ వాంగ్మూలంలో ఏముంది?

అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గుండె ఆగిపోవడం వల్లే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆగస్టు 25వ తేదీన చోటు చేసుకుంది. అంతా జిమ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను giedde పేరిట ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు బాధను వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సానూభూతి, సంతాపం తెలియచేస్తున్నారు.