30వేలకు పైగా చెట్లు నాటిన మహిళ.. ఎందుకంటే?

  • Publish Date - January 10, 2020 / 01:45 AM IST

సూరత్ నగరంలో బ్రెయిన్ ట్యూమర్‌ తో బాధపడుతున్న శ్రుచి వడాలియా అనే 27ఏళ్ల మహిళ వాయు కాలుష్యన్ని తగ్గించేందుకు 30వేల చెట్లను నాటింది. తనకు ఈ వ్యాధి ఉందని తెలిశాక, పర్యావరణాన్ని కాపాడటానికి ఈ చెట్లను నాటడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమెకు క్యాన్సర్ రావడానికి ఈ వాయు కాలుష్యమే కారణమని తెలిసింది.

దీంతో తను బ్రతికుండగానే వాయు కాలుష్యన్ని కొంచెం అయినా తగ్గించే ప్రయత్నం చేయాలని… ఎక్కవగా చెట్లు నాటితే చాలామందిని వ్యాధులు నుంచి రక్షించవచ్చని నిర్ణయించుకుంది. అందుకే ఆమెకు ఆ వ్యాధి వచ్చనప్పటి నుంచి చెట్లు నాటడం ప్రారంభించింది. అంతేకాదు వీలైనంత వరకు తన స్నేహితులు, బంధువులకు కూడా చెట్లు నాటమని చెబుతోంది.

ఈ సందర్భంగా శ్రుచి వడాలియా మాట్లాడుతూ… నేను త్వరలోనే చనిపోతాను, అందుకే నేను ఉన్నన్ని రోజులు చెట్లను నాటితే.. కనీసం ప్రజల ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడిన దాన్ని అవుతానని చెప్పింది. గత రెండేళ్లలో 30వేలకు పైగా చెట్లను నాటింది. అంతేకాదు గ్రామాలకు వెళ్లి పాఠశాలలో పిల్లలను కలిసి చెట్లను నాటమని వారిని ప్రోత్సహించాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు