చైనాలోని ఊహాన్‌లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చేయడమే టార్గెట్టా.. లేదా యాదృచ్చికంగానే జరుగుతుందా.. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలను బలహీనం చేయాలని ఏవైనా అజాత శక్తులు ప్రయత్నిస్తున్నాయా.. అంటే జరిగే ఘటనలు అవుననేలా చేస్తున్నాయి. దానికి కారణం పాట్నాలోనూ కరోనా వైరస్ ఓ యువతిలో కనిపించడమే.
కేరళకు చెందిన నర్సు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతూ చైనాలోనే చికిత్స తీసుకుంటుంది. అక్కడే ఉంటున్న ఆమె సోదరుడు చికిత్సకు సహాయం కావాలని పలు సేవాసంస్థలను అర్థించాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే భారత్ కు తీసుకురావాలని అనుకుంటున్నా అక్కడే ఉంచి చికిత్స అందించలేని పరిస్థితుల్లో భారత్ కు తీసుకొచ్చేందుకే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే రెండ్రోజుల ముందు చైనాలో చదువుకుంటున్న ముంబై స్టూడెంట్లు ఇద్దరు, ఓ హైదరాబాదీ స్టూడెంట్ ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డట్లు గుర్తించి వారిని చికిత్స కోసం అక్కడే ఆసుపత్రిలో ఉంచారు. సోమవారం మరో యువతి పట్నాలోని చప్రా ప్రాంతానికి చెందిన బాలిక చైనాకు వెళ్లి తిరిగొచ్చింది. ఆమెకు కూడా అదే లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
చైనాలో ఇదే వైరస్ బారిన పడి దాదాపు 80వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు చూస్తుంటే వైరస్ కావాలని అంటించినట్లు అనిపించకపోవచ్చు. కానీ, ఈ వైరస్ పుట్టిన చోటు చూస్తే అనుమానాలు రాకుండా ఉండవు. వూహాన్‌లో ఉన్న లేబరేటరీలో వైరస్‌ల గురించి పరీక్ష చేస్తుండగా ఇది బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయేల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ చేతుల మీదుగా వ్యాప్తి చెందినట్లు అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.